India Vs China : భారత్‌కి అండగా ఇజ్రాయిల్... అత్యవసర సాయానికి అంగీకారం

India- China Tensions | గాల్వాన్ లోయలో చైనా సేనలు, భారత సేనల మోహరింపుతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు భారత్ అత్యాధునిక ఆయధాలను సమకూర్చుకుంటోంది.

news18-telugu
Updated: July 1, 2020, 12:22 PM IST
India Vs China : భారత్‌కి అండగా ఇజ్రాయిల్... అత్యవసర సాయానికి అంగీకారం
ఇజ్రాయిల్ లో తయారైన స్పైస్ 2000 బాంబు (ఫైల్ ఫోటో)
  • Share this:
విదేశీ వ్యవహారాలకు సంబంధించి గత కొన్నేళ్లుగా భారత్ అనుసరిస్తున్న విధానాలు, వ్యూహాలూ సత్ఫలితాలను ఇస్తున్నాయి. మునుపెన్నడూ లేని స్థాయిలో ఇజ్రాయిల్‌తో భారత్ మైత్రీ సంబంధాలు బలోపేతమయ్యాయి. చైనా, పాకిస్థాన్ వంటి పొరుగు దేశాలు పక్కలో బల్లెంలా తయారైన వేళ...ఇజ్రాయిల్ భారత్‌కు అండగా నిలుస్తోంది. తూర్పు లడఖ్ లోని గాల్వాన్ లోయలో 20 మంది భారత సేనలను కయ్యాలమారి చైనా పొట్టనబెట్టుకోవడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. చైనాకు దీటుగా ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు భారత్ సర్వ సన్నద్ధమైంది. రెండు దేశాల సేనల మోహరింపుతో దేశ వాస్తవాధీన రేఖ వెంబడి టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. చైనాతో ఉద్రిక్తతల కారణంగా అధునాతన ఆయుధాలను సమకూర్చుకోవడంలో భారత రక్షణ శాఖ నిమగ్నమైంది. డ్రాగన్ దేశం కయ్యానికి కాలుదువ్వుతుండటంతో ఎలాంటి అనుమతులూ లేకుండానే రూ.500 కోట్ల లోపు ఆయుధాలను కొనుగోలు చేసుకునేందుకు భారత రక్షణ దళాలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది.

ఇందులో భాగంగా ఇజ్రాయిల్ నుంచి అత్యవసరంగా SPICE-2000 బాంబులను భారత వైమానిక దళం (IAF) కొనుగోలు చేస్తోంది.  భారత వైమానిక దళం నుంచి అందిన అభ్యర్థన మేరకు దీన్ని అత్యవసరంగా సమకూర్చేందుకు ఇజ్రాయిల్ అంగీకరించినట్లు తెలుస్తోంది. చివరగా 2019లో పాకిస్థాన్‌లోని బాలకోట్‌‌లోని తీవ్రవాద స్థావరాలపై నిర్వహించిన మెరుపుదాడుల్లో భారత వైమానిక దళం ఈ బాంబులను వినియోగించింది. ఫ్రాన్స్‌లో తయారైన మిరాజ్-2000 జెట్స్ ద్వారా ఈ బాంబులను వినియోగించారు. నియంత్రణ రేఖకు 60 కిలోమీటర్ల దూరంలోని బాలకోట్‌లో ఉన్న తీవ్రవాదుల శిబిరాలను ఈ బాంబులు క్షణాల్లో నేలమట్టం చేశాయి.

spice 2000 bombs, india israel relations, India China Tensions Updates, india china border tensions, india china face off, donald trump on china, galwan valley, india vs china, గల్వాన్ లోయ, భారత్ చైనా టెన్షన్, భారత్ చైనా యుద్ధం
ఇజ్రాయిల్‌లో తయారైన స్పైస్ 2000 బాంబులు


గగనతలం నుంచి భూతలంలోని లక్ష్యాలను టార్గెట్ చేసేందుకు ఈ SPICE-2000 బాంబులు ఉపయోగపడుతాయి. శత్రు దేశాల బంకర్లు, భవంతులను క్షణాల్లో పూర్తిగా నేలమట్టం చేయగల సామర్థ్యం వీటి సొంతం. గత ఏడాది కొనుగోలు చేసిన వాటికి అదనంగా ఇప్పుడు వీటిని భారత్ కొనుగోలు చేస్తోంది. స్మార్ట్, ప్రిసైజ్ ఇంపాక్ట్, కాస్ట్ ఎఫెక్టివ్‌కి సంక్షిప్త నిర్వచనంగా SPICE అని పిలుస్తున్నారు.

అటు ఫ్రాన్స్ కూడా రాఫెల్ యుద్ధ విమానాలను ఈ నెలాఖరుకల్లా భారత్‌కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రాఫెల్ యుద్ధ విమానాలు కూడా వస్తే భారత రక్షణ దళం మునుపెన్నడూ లేనంత పటిష్టంగా మారనుంది.
First published: July 1, 2020, 12:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading