INDIA CHINA TENSIONS CHINESE ENVOY SAYS GALWAN CLASH A BRIEF MOMENT IN HISTORY
India - China Tensions: గల్వాన్ ఘటన దురదృష్టకరం...నక్కజిత్తుల చైనా పశ్చాత్తాపం
ప్రతీకాత్మక చిత్రం
India China Tensions | గల్వాన్‌లో భారత్-చైనా సేనల ఘర్షణ దురదృష్టకర సంఘటనగా అభివర్ణిస్తూ చైనా మొసలి కన్నీరు కార్చింది. తూర్పు లద్ధఖ్‌లోని గల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణల్లో కల్నల్ సంతోష్ బాబుతో పాటు 20 మంది భారత జవాన్లను అమరుకావడం తెలిసిందే.
గల్వాన్‌లో భారత్-చైనా సేనల ఘర్షణ దురదృష్టకర సంఘటనగా అభివర్ణిస్తూ చైనా మొసలి కన్నీరు కార్చింది. తూర్పు లద్ధఖ్‌లోని గల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణల్లో కల్నల్ సంతోష్ బాబుతో పాటు 20 మంది భారత జవాన్లను అమరుకావడం తెలిసిందే. అయితే ఈ ఘర్షణల్లో చైనా వైపు కూడా భారీగా ప్రాణనష్టం జరిగినా...దీనిపై డ్రాగన్ దేశం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. గల్వాన్ ఘటనకు ప్రతీకారంగా చైనాను ఆర్థికంగా దెబ్బతీసే పలు నిర్ణయాలు తీసుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా ఇప్పటికే టిక్ టాక్ సహా పలు చైనా మొబైల్ యాప్స్‌ను బ్యాన్ చేసింది. ఈ నేపథ్యంలో గల్వాన్ ఘటన పట్ల పశ్చాత్తాపం వ్యక్తంచేస్తూ చైనా నక్కజిత్తులు ప్రదర్శించింది. ఇండియా-చైనా యూత్ ఫోరం నిర్వహించిన వెబినార్‌లో పాల్గొని మాట్లాడిన భారత్‌లోని చైనా రాయబారి సన్ వీడాంగ్...గల్వాన్ తరహా దురదృష్టకర ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు.
అత్యంత పురాతన నాగరిత కలిగిన ఇరు దేశాలు..పరస్పరం ఒకరినొకరు గౌరవించుకుంటూ..ఒకరినుంచి మరొకరు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని సన్ వీడాంగ్ అన్నారు. ఇరు దేశాలు ఒకరినొకరు సమానంగా భావించాలని అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న బలమైన దౌత్య సంబంధాలపై ‘ఒక సంఘటన’ ప్రభావం చూపరాదన్నారు. భారత్‌తో సరిహద్దు వివాదాలను పరిష్కరించుకునేందుకు చైనా ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. భారత్ విషయంలో చైనా విధాన నిర్ణయంలో ఎలాంటి మార్పు రాలేదని స్పష్టంచేశారు.
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలుగా భారత్, చైనాల మధ్య పరస్పర సహకారం ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. వివాదాలకు స్వస్తి పలికి అభివృద్ధి దిశగా ఇరు దేశాలు ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. భారత్‌ను చైనా ప్రత్యర్థిగా కాకుండా ఓ మిత్రదేశంగా చూస్తోందని చెప్పుకొచ్చారు. భారత్‌లో పెరిగిన స్వయం సమృద్ధి నినాదం గురించి సన్ వీడాంగ్ ప్రస్తావిస్తూ...ఏ దేశమూ ఒంటరిగా అభివృద్ధి సాధించడం సాధ్యంకాదని అభిప్రాయపడ్డారు.
Published by:Janardhan V
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.