INDIA CHINA TENSION TRADERS BODY CAIT TO LAUNCH CAMPAIGN TO BOYCOTT CHINESE GOODS MK
India - China: 3000 చైనా వస్తువుల జాబితా సిద్ధం...వోకల్ ఫర్ లోకల్‌కు మద్దతు...
ప్రతీకాత్మకచిత్రం
చైనా నుండి దిగుమతి చేసుకున్న సుమారు 3 వేల ఉత్పత్తుల జాబితాను క్యాట్ తయారు చేసింది. ఆయా వస్తువులను దిగుమతి చేయకపోవడం వల్ల భారతదేశానికి ఎలాంటి నష్టం ఉండదని, ఆ వస్తువులన్నీ ఇప్పటికే భారతదేశంలో తయారవుతున్నాయని క్యాట్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ పేర్కొన్నారు.
చైనా వస్తువుల బహిష్కరణకు సంబంధించి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) వినూత్న కార్యక్రమం చేపట్టింది. CAIT తరపున చైనా వస్తువులను బహిష్కరించాలనే కార్యక్రమాన్ని భారీగా ఎత్తున చేపట్టాలని జూన్ 10 నుంచి ప్రారంభంచనుంది. ప్రధాని నరేంద్ర మోదీ 'వోకల్ ఫర్ లోకల్' పిలుపు మేరకు ఈ ప్రచారం సహాయపడుతుందని పేర్కొన్నారు. 2021 డిసెంబర్ నాటికి చైనా వస్తువుల దిగుమతిని సుమారు రూ .1.5 లక్షల కోట్లకు తగ్గించడమే మా లక్ష్యమని క్యాట్ తెలిపింది.
చైనా నుండి దిగుమతి చేసుకున్న సుమారు 3 వేల ఉత్పత్తుల జాబితాను క్యాట్ తయారు చేసింది. ఆయా వస్తువులను దిగుమతి చేయకపోవడం వల్ల భారతదేశానికి ఎలాంటి నష్టం ఉండదని, ఆ వస్తువులన్నీ ఇప్పటికే భారతదేశంలో తయారవుతున్నాయని క్యాట్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్యాట్ చైనా వస్తువులను విక్రయించవద్దని వ్యాపారులను క్యాట్ కోరింది. చైనా వస్తువుల బదులుగా దేశీయ ఉత్పత్తులను ఉపయోగించాలని దేశ ప్రజలను కోరింది. 'లోకల్ ఆన్ వోకల్' విజయవంతం చేయడంలో క్యాట్ ముఖ్య పాత్ర పోషిస్తుందని క్యాట్ రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్ర గోయల్ అన్నారు.
చైనా వస్తువులను బహిష్కరిస్తామని వ్యాపారులు, భారత పౌరులు ప్రతిజ్ఞ చేశారని కాట్ తెలిపింది. అయితే ఈ మార్పు రాత్రికి రాత్రి జరగదని, కాని దీనిని ప్రారంభించి మా లక్ష్యాన్ని సాధిస్తామని క్యాట్ తెలిపింది.
చైనా నుండి 6 బిలియన్ డాలర్ల దిగుమతి తగ్గింది
తమ కార్యక్రమాల ఫలితంగా, చైనా నుండి దిగుమతులు 2017-18లో 76 బిలియన్ డాలర్ల నుండి ప్రస్తుతం 70 బిలియన్ డాలర్లకు తగ్గాయి. 6 బిలియన్ డాలర్ల దిగుమతి క్షీణత దేశీయ వస్తువుల వాడకం, అలాగే మారుతున్న వినియోగదారుల మనోభావాలను తెలియజేస్తుందని ఖండేల్వాల్ అన్నారు.
ఇటువంటి ప్రయత్నాల ద్వారా 2021 డిసెంబర్ నాటికి 13 బిలియన్ డాలర్ల (సుమారు 1 లక్ష కోట్ల రూపాయలు) విలువైన చైనా వస్తువులను దిగుమతి చేసుకోవడంపై సిఏఐటి దృష్టి సారించిందని, చైనా నుంచి దిగుమతి చేసుకున్న సుమారు 3,000 ఉత్పత్తుల సమగ్ర జాబితాను తయారుచేశామని అన్నారు. దీని కోసం భారతీయ ఎంపికలు సులభంగా లభిస్తాయి.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.