చైనా యాప్స్‌తో యూజర్ల డేటాకు ముప్పు ఉందన్న వాదన ఇప్పటిది కాదు. చాలాకాలంగా ఉన్నదే. ఈ భయంతో స్మార్ట్‌ఫోన్ యూజర్లు చైనా యాప్స్‌ను వాడటం తగ్గించేశారు. ఇప్పుడు భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు చైనాతో లింక్ ఉన్న 52 యాప్స్‌ని గుర్తించాయి. భారతదేశంలో ప్రాచుర్యం పొందిన ఈ యాప్స్‌తో జాతీయ భద్రతకు ముప్పు అని, ఇవి ప్రమాదకరమైన యాప్స్ అని భావిస్తున్నాయి ఇంటెలిజెన్స్ వర్గాలు. వీటిలో టిక్‌టాక్, షేర్ ఇట్, యూసీ బ్రౌజర్ లాంటి ప్రముఖ యాప్స్ ఉన్నాయి. ఇలాంటి యాప్స్ ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లలో ప్రీ-ఇన్‌స్టాల్ అయి వస్తాయి. ఈ యాప్స్ జాబితాలో ఇటీవల కరోనా వైరస్ లాక్‌డౌన్ కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన వీడియో కాన్ఫరెన్సింగ్ సర్వీస్ యాప్ జూమ్ కూడా ఉంది. ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రమాదకరంగా గుర్తించిన 52 చైనా యాప్స్ జాబితా ఇదే.
1. 360 Security
2. APUS Browser
3. Baidu Map
4. Baidu Translate
5. BeautyPlus
6. Bigo Live
7. CacheClear DU apps studio
8. Clash of Kings
9. Clean Master – Cheetah
10. ClubFactory
11. CM Browser
12. DU Battery Saver
13. DU Browser
14. DU Cleaner
15. DU Privacy
16. DU recorder
17. ES File Explorer
18. Helo
19. Kwai
20. LIKE
21. Mail Master
22. Mi Community
23. Mi Store
24. Mi Video call-Xiaomi
25. NewsDog
26. Parallel Space
27. Perfect Corp
28. Photo Wonder
29. QQ International
30. QQ Launcher
31. QQ Mail
32. QQ Music
33. QQ NewsFeed
34. QQ Player
35. QQ Security Centre
36. ROMWE
37. SelfieCity
38. SHAREit
39. SHEIN
40. TikTok
41. UC Browser
42. UC News
43. Vault-Hide
44. Vigo Video
45. Virus Cleaner (Hi Security Lab)
46. VivaVideo- QU Video Inc
47. WeChat
48. Weibo
49. WeSync
50. Wonder Camera
51. Xender
52. YouCam Makeup
ప్రస్తుతం ఈ 52 యాప్స్ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ ఐఓఎస్ యాప్ స్టోర్‌లో ఉన్నాయి. భారతదేశానికి చెందిన వేర్వేరు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు రూపొందించిన ఈ యాప్స్ జాబితాకు భారత జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్ నుంచి మద్దతు కూడా వచ్చినట్టు సమాచారం. భారతదేశం, చైనాల మధ్య ఉద్రిక్తలు నెలకొనడంతో చైనా డెవలపర్స్ ప్రమోట్ చేస్తున్న ఈ యాప్స్ విషయంలో భద్రతాపరమైన ఆందోళనలు నెలకొన్నాయి. ఇటీవల స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షావోమీకి చెందిన సొంత బ్రౌజర్ డేటాను కలెక్ట్ చేస్తుందన్న వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
Tecno spark power 2: పెద్ద డిస్‌ప్లే, భారీ బ్యాటరీ... రూ.9,999 ధరకే అదిరిపోయే ఫీచర్స్
Flipkart: మీ స్మార్ట్‌ఫోన్ పాడైందా? రూ.99 చెల్లిస్తే ఇంటి దగ్గరే రిపేర్
రూ.9,999 ధరకే కంప్యూటర్... వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి మంచి ఆఫర్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: China, India-China, Indo China Tension, Mobile App, Tech, Technology