Home /News /india-china /

INDIA CHINA PLA DEATH SQUADS HUNTED DOWN INDIAN TROOPS IN GALWAN IN SAVAGE EXECUTION SPREE SAY SURVIVORS NK

India-China : సరిహద్దుల్లో 8 గంటలపాటూ ఘర్షణ... రాడ్లు, ఇనుప కంచెలతో చైనా దాడి...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భారత్-చైనా మధ్య సోమవారం రాత్రి మినీ యుద్ధమే జరిగింది. అక్కడ ఏం జరిగిందో వాస్తవాల్ని తెలుసుకుంటే... చైనా సైన్యం ఎంతటి దారుణాలకు పాల్పడిందో అర్థం అవుతుంది.

    ఇప్పటివరకూ మనం సోమవారం రాత్రి భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగింది అని అనుకుంటున్నాం. కానీ... అదో మినీ యుద్ధమేనని తాజాగా తెలిసింది. చైనా సైన్యం పక్కా వ్యూహంతో ఇదంతా చేసింది. గాల్వన్ లోయలో... రాత్రి వేళ ఏకంగా 8 గంటలపాటూ... పాకిస్థాన్ ఆర్మీ... ఇనుప రాడ్లు, ఇనుప వైర్లతో చుట్టిన లాఠీలతో భారత సైన్యం వెంటపడి మరీ దాడి చేసింది. 16 బీహార్ రెజిమెంట్ జవాన్లను అత్యంత పాశవికంగా చంపింది. భారత ప్రభుత్వానికి చెందిన ఓ సీనియర్ ప్రభుత్వాధికారి... న్యూస్18కి వాస్తవంగా ఏం జరిగిందో తెలిపారు. ఈ యుద్ధంలో మొత్తం 23 మంది భారత సైనికులు చనిపోయినట్లు తెలిసింది. వారిలో 16 బీహార్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంతోష్ బాబు కూడా ఉన్నారు. అసలే అక్కడ రక్తం గడ్డకట్టే వాతావరణం ఉండటంతో... ఇండియన్ ఆర్మీకి అది కాళరాత్రిగా మారింది.

    చైనా దాడి చేసిన సమయంలో... సైన్యంలో కొంత మంది దగ్గర ఆయుధాలు లేవు. అందువల్ల వారు... ఓ కొండ ఎక్కేందుకు ప్రయత్నిస్తుంటే... డ్రాగన్ సైన్యం తరిమి తరిమి మరీ చంపిందని తెలిసింది. కొంత మంది గాల్వన్ నదిలో దూకి ప్రాణాలతో బయటపడేందుకు ప్రయత్నించగా... వాళ్లను కూడా వెంటాడి వెంటాడి చైనా సైన్యం చంపిందని తెలిసింది. ప్రస్తుతం మరో పాతికమంది భారత సైనికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మరో 110 మందికి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారని సమాచారం. అందువల్ల మృతుల సంఖ్య పెరగవచ్చంటున్నారు.

    ఇదంతా చైనా కావాలనే చేసినట్లు క్లియర్‌గా తెలుస్తోంది. ఐదు వారాలుగా సైన్యాన్ని మోహరించిన డ్రాగన్... వాళ్లను ఊరికే వెనక్కి పిలిపించుకోవడం ఇష్టం లేక... ఎలాగైనా భారత్‌పై దాడి చేయాలని కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. దాడి చేయడం కోసమే ముందుగానే ఇనుప రాడ్డులను సిద్ధం చేసుకున్నారు. అలాగే... లాఠీలకు ఇనుప వైర్లను చుట్టుకొని రెడీ చేసుకున్నారని సమాచారం. చైనా సైన్యం వేసుకున్న ఓ టెంటును భారత సైన్యం ఆదివారం తగలబెట్టింది. దీనిపై చైనా ఆర్మీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే వివాదానికి దారితీసిందా అనే అనుమానాలు ఉన్నాయి.

    టెంటు తగలబెట్టిన తర్వాత ఆదివారం రెండు వైపులా సైన్యాలు రాళ్లు విసురుకున్నాయి. సోమవారం రాత్రి మాత్రం 16 బీహార్ సైన్యం ఆయుధాలు లేకుండా ఉంది. అదే సమయంలో ఈ దాడి చేసిన చైనా ఆర్మీ... పెద్ద పెద్ద బండరాళ్లను కూడా మన సైనికులపైకి విసిరినట్లు తెలిసింది. సోమవారం చాలా మృతదేహాల్ని చైనా సైన్యం భారత్‌కి అప్పగించింది.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Indo China Tension

    తదుపరి వార్తలు