India-China: చైనాతో సరిహద్దు వివాదంపై ప్రధాని మోదీ కీలక ప్రకటన

భారత్ శాంతి కోరుకుంటోందని.. కానీ తమదేశ సార్వభౌత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు ప్రధాని మోదీ.

news18-telugu
Updated: June 19, 2020, 11:02 PM IST
India-China: చైనాతో సరిహద్దు వివాదంపై ప్రధాని మోదీ కీలక ప్రకటన
భారత్ శాంతి కోరుకుంటోందని.. కానీ తమదేశ సార్వభౌత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు ప్రధాని మోదీ.
  • Share this:
సరిహద్దులో చైనా దూకుడు, గల్వాన్ లోయ ఘర్షణలపై ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. భారత్ సరిహద్దులోకి ఎవరూ చొరబడలేదని.. ఆర్మీకి చెందిన ఏ ఒక్క పోస్టునూ చైనా ఆక్రమించలేదని స్పష్టం చేశారు. ఒక్క అంగుళం భూమిని కూడా వదులుకునే ప్రసక్తే లేదన్న ఆయన.. సైనికులకు అత్యాధునిక ఆయుధాలను అందిస్తామని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అఖిల పక్ష నేతలతో మాట్లాడిన అనంతరం.. ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా చైనా తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారత్ శాంతి కోరుకుంటోందని.. కానీ తమదేశ సార్వభౌత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు ప్రధాని మోదీ.

భారత భూభాగంలోకి ఎవరూ చొరబడలేదు. ఇంత వరకు ఎవరూ అడ్డకోలేని చైనా ఆర్మీని భారత బలగాలు ధీటుగా ఎదుర్కొంటున్నాయి. 20 మంది మన జవాన్లు అమరులయ్యారు. మన దేశాన్ని ఎదురించిన వారికి గతంలో గట్టిగానే గుణపాఠం చెప్పాం. మన సరిహద్దులను కాపాడే శక్తి సామర్థ్యాలు భారత సైన్యానికి ఉన్నాయి. ఎలాంటి నిర్ణయమైనా తీసుకునేందుకు ఆర్మీకి పూర్తి స్వేచ్ఛనిచ్చాం. భారత్‌పై బయటి నుంచి ఎలాంటి ఒత్తిడి లేదు. దేశ రక్షణ, ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఏ నిర్ణయమైనా తీసుకుంటాం.
ప్రధాని మోదీ


చైనాతో సరిహద్దు వివాదంపై ప్రధాని మోదీ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 20 పార్టీల నేతలతో..భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. సమావేశంలో కేంద్రం తరపున ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్, హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్ పాల్గొన్నారు. సమావేశానికి కాంగ్రెస్ నేత సోనియా గాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా,
బీఎస్పీ నేత మయావతి, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్, ఎన్సీపీ నేత శరద్ పవార్, బీహార్ సీఎం నితీష్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, సీపీఎం నేత సీతారాం ఏచూరి, తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్‌తో పాటు పలు పార్టీల నేతలు హాజరయ్యారు. సమావేశంలో అన్ని పార్టీల నేతలు ప్రధాని మోదీక పలు సలహాలు, సూచనలు చేశారు.

సరిహద్దులో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. చైనా బలగాలు లద్దాఖ్‌లతో ఎప్పడు ప్రవేశిచాయి. మే 5 నుంచి జూన్ 6 వరకు విలువైన సమయాన్ని వృథా చేశాం. అఖిల పక్ష సమావేశం ఎప్పుడో జరగాల్సి ఉంది. కమాండర్ స్థాయి చర్చల తర్వాత దౌత్యపరమైన చర్చలు జరపాల్సి ఉంది.ప్రభుత్వ వైఫల్యం వల్లే 20మంది జవాన్లు చనిపోయారు.
- సోనియా గాంధీ

చైనా విషయంలో ఏమాత్రం తొందరపాటు ఉండొద్దు. అదే సందర్భంలో దేశ ప్రయోజనాల విషయంలో తలవంచాల్సిన అవసరం లేదు. చైనాను ఎదుర్కొనేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు అవలంబించాలి. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి తాము పూర్తి అండగా నిలుస్తాం. దేశంలో ఇప్పుడు కావల్సింది రాజకీయం కాదు. యుద్ధనీతి కావాలి. భారతదేశంలో పరిపాలన సుస్థిరంగా ఉండడంతో పాటు, గొప్ప ఆర్థిక శక్తిగా ఎదగడం ఓర్వలేకనే చైనా కయ్యానికి కాలుదువ్వుతోంది.-కేసీఆర్, తెలంగాణ సీఎం

ప్రధాని మోదీయే మన దేశ బలం. ప్రపంచ వ్యాప్తంగా వ్యూహాత్మక భాగస్వామ్యం నెలకొల్పారు. భారత్‌ను అస్థిర పరిచేందుకు చైనా కుట్రలు చేస్తోంది. దౌత్య, ఆర్థిక పరంగా చైనాను ఎదుర్కోవాలి.
-వైఎస్ జగన్, ఏపీ సీఎం

ఇండియా శాంతి కోరుకుంటోంది. దానికి అర్థం మేం బలహీనంగా ఉన్నామని కాదు. మోసం చేయడమే చైనా నైజం. ఈ సమయంలో అందరూ ప్రధాని మోదీ వెంట ఉంటాం.
- ఉద్ధవ్ థాక్రే, మహారాష్ట్ర సీఎం

సైనికులు ఆయుధాలు తీసుకెళ్లారా లేదా అనేది అంతర్జాతీయ ఒప్పందాలు తేల్చుతాయి. ఇలాంటి సున్నితమైన అంశాలను మనమంతా గౌరవించాలి.
- శరద్ పవార్, ఎన్సీపీ అధినేత

చైనా పట్ల కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఏ నిర్ణయం తీసుకున్నా మేం మద్దతిస్తాం.
- పినాకి మిశ్రా, బీజేడీ నేత

చైనా పట్ల భారత ప్రజలంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ సమయంలో మన మధ్య భేదాభిప్రాయలు ఉండకూడదు. అందరూ ఐక్యమత్యంతో ఉండాలి. కేంద్రానికి అండగా ఉండాలి.
- నితీష్ కుమార్, బీహార్ సీఎం

అఖిల పక్ష సమావేశం దేశానికి మంచి సందేశం. ఆర్మీ పట్ల మనమంతా ఒకే తాటిపై ఉన్నామన్న సందేశం వెళ్తుంది. కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉంటాం. టెలికాం, రైల్వే, ఏవియేషన్ రంగంలోకి చైనా కంపెనీలు అడుగుపెట్టకుండా కట్టడి చేయాల్సి అవసరంఉంది.
- మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ సీఎం

భారత ప్రభుత్వం పంచశీల సూత్రాలను పాటించాలి.
-సీతాారాం ఏచూరి, సీపీఎం

కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఇది సమయం కాదు. భారత దేశం ప్రధాని మోదీ వెంట ఉంది. మనమంతా ప్రధాని మోదీ వెంటే ఉన్నామన్న సందేశాన్ని చైనాకు పంపించాలి.
- సుఖ్బీర్ సింగ్ బాదల్,అకాళీదళ్ నేత


ప్రధాని మోదీపై మాకు పూర్తి నమ్మకముంది. గతంలో పలు సందర్భాల్లో చారిత్రక నిర్ణయాలు తీసకున్నారు. ప్రభుత్వానికి అండగా ఉంటాం.
- ప్రేమ్ సింగ్ తమాంగ్, సిక్కి సీఎం


First published: June 19, 2020, 9:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading