చైనా దూకుడుకు చెక్.. గల్వాన్ నదిపై భారత్ వంతెన నిర్మాణం పూర్తి

చైనా ఎంత దూకుడు ప్రదర్శించినప్పటికీ.. భారత్ వెనకడుగు వేయలేదు. గల్వాన్ లోయపై బ్రిడ్జి నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తిచేసింది. లోయలో రోడ్లు, నదిపై బ్రిడ్జి నిర్మించిన నేపథ్యంలో గల్వాన్‌లో సైనిక కార్యకలాపాలు మరింత పెరగనున్నాయి.

news18-telugu
Updated: June 20, 2020, 7:09 AM IST
చైనా దూకుడుకు చెక్.. గల్వాన్ నదిపై భారత్ వంతెన నిర్మాణం పూర్తి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇండియా, చైనా సరిహద్దులో కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. గల్వాన్ లోయలో ఇరుదేశాల సైన్యాలు ఘర్షణకు దిగడంతో భారీగా ప్రాణనష్టం జరిగింది. ఐతే ఈ లోయలో చైనా దూకుడుకు చెక్ పెట్టే దిశగా కీలక అడుగు మందుకు పడింది. గల్వాన్ నదిపై భారత సైనిక ఇంజినీర్లు గురువారం వంతెన నిర్మాణం పూర్తి చేశారు. 60 మీటర్ల పొడవున్న ఈ బ్రిడ్జిపై నుంచి ఆర్మీ వాహనాలు ఈజీగా నదిని దాటుతాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. గల్వాన్ నదిపై ఇప్పటి వరకు జవాన్లు కాలినడకన వెళ్లేందుకు మాత్రమే వంతెన ఉండేది. ఇప్పుడు వాహనాలు సైతం వెళ్లేలా కూడా బ్రిడ్జి నిర్మించడంతో అక్కడ మరింత నిఘా పెంచవచ్చు.

ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు చైనా ఆర్మీ ఎన్నో సార్లు ప్రయత్నించి విఫలమైంది. బ్రిడ్జి నిర్మిస్తున్నారనే అక్కసుతోనే ఉద్దేశ్వపూర్వకంగా గొడవలకు దిగింది. ఈ క్రమంలోనే అక్కడ కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఐతే చైనా ఎంత దూకుడు ప్రదర్శించినప్పటికీ.. భారత్ వెనకడుగు వేయలేదు. గల్వాన్ లోయపై బ్రిడ్జి నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తిచేసింది. లోయలో రోడ్లు, నదిపై బ్రిడ్జి నిర్మించిన నేపథ్యంలో గల్వాన్‌లో సైనిక కార్యకలాపాలు మరింత పెరగనున్నాయి. ఈ క్రమంలో ఆర్మీ వాహనాలు, ఆయుధాలను తరలించి చైనాక ధీటైన జవాబు ఇవ్వవచ్చని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడ్డారు.

జూన్ 15, 16 తేదీల్లో గల్వాన్ లోయలో భారత్, చైనా జవాన్ల మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘటనలో కల్నల్ సంతోష్ బాబ సహా 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. చైనాకు చెందిన 43 మంది సైనికులు మరణించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఐతే చైనా మాత్రం అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఐతే 20 మంది సైనికులు మరణించడాన్ని భారత్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. చైనాను ఎలా దెబ్బకొట్టాలన్న దానిపై వ్యూహాలు రచిస్తోంది. తామ శాంతికాముకులమని.. కానీ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని ప్రధాని హెచ్చరించారు.
First published: June 20, 2020, 7:01 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading