India-China: చైనా-భారత్ వివాదంపై రాజ్యసభలో రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

ప్రస్తుత ఉద్రిక్తతలను శాంతింపజేసేందుకు భారత్ కట్టుబడి ఉందని.. అదే క్రమంలో ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

news18-telugu
Updated: September 17, 2020, 1:31 PM IST
India-China: చైనా-భారత్ వివాదంపై రాజ్యసభలో రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన
రాజ్యసభలో రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగం
  • Share this:
లద్దాఖ్ సరిహద్దులో భారత్, చైనా మధ్య కొన్ని రోజులుగా యుద్ధ వాతావరణ నెలకొంది. పోటా పోటీగా సైన్యం మోహరింపులతో ఏం క్షణం ఏం జరుగుతుందోన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో పరిస్థితులపై రాజ్యసభలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత ఉద్రిక్తతలను శాంతింపజేసేందుకు భారత్ కట్టుబడి ఉందని.. అదే క్రమంలో ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఎల్ఏసీ వెంబడి కవ్విస్తూ ఇరుదేశాల ఒప్పందాలను చైనా ఆర్మీ ఉల్లంఘిస్తోందని విమర్శించారు రాజ్‌నాథ్ సింగ్. సరిహద్దుల్లో చైనా నిర్మాణాలను చేపడుతోందని.. వారికి ధీటుగా భారత్ సైతం సరిహద్దు వెంబడి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. చైనా సైన్యం కదలికలపై నిఘా పెట్టినట్లు ఆయన తెలిపారు.

''1962లో లద్దాఖ్‌లో చైనా 38వేల చదరపు కి.మీ మేర ఆక్రమించింది. పాకిస్థాన్‌ నుంచి 5వేల చ.కి.మీ భూమిని తీసుకొంది. అంతేకాదు అరుణాచల్‌ప్రదేశ్‌లోని 90 వేల చ.కి.మీ భూభాగం తమదని చైనా వాదిస్తోంది. 1988 తర్వాత భారత్‌, చైనాలు అనేక ఒప్పందాలు చేసుకున్నాయి. వాటిని చైనా ఉల్లంఘిస్తోంది. చైనా చెప్పేదొకటి. చేసేది మరొకటి. సరిహద్దు ఒప్పందాలను ఉల్లంఘించడమే ఇందుకు నిదర్శనం. ఇది మంచి పద్దతి కాదు. ప్రస్తుతం లద్దాఖ్‌లో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.'' అని రాజ్యసభలో రాజ్‌నాథ్ సింగ్.
Published by: Shiva Kumar Addula
First published: September 17, 2020, 1:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading