గాల్వాన్ ఘర్షణలో చైనా సైనికులూ చనిపోయారు... డ్రాగన్ అధికారిక మీడియా కథనం...

ఇప్పటివరకూ గాల్వాన్ ఘర్షణలో చైనా సైనికులు చనిపోయారా లేదా అనే అంశంపై క్లారిటీ లేదు. ఇప్పుడు నిజం బట్టబయలు అయ్యింది.

news18-telugu
Updated: June 22, 2020, 12:44 PM IST
గాల్వాన్ ఘర్షణలో చైనా సైనికులూ చనిపోయారు... డ్రాగన్ అధికారిక మీడియా కథనం...
గాల్వాన్ ఘర్షణలో చైనా సైనికులూ చనిపోయారు... డ్రాగన్ అధికారిక మీడియా కథనం... (credit - twitter)
  • Share this:
గత సోమవారం జూన్ 15 రాత్రి భారత సరిహద్దులోని గాల్వాన్ లోయలో... భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో... చైనా సైనికులు కూడా చనిపోయారన్న అంశంపై స్పష్టత వచ్చింది. చైనా ప్రభుత్వం నడుపుతున్న మీడియా గ్లోబల్ టైమ్స్... తాజాగా ఓ ట్వీట్ చేసింది. గాల్వాన్ ఘర్షణలో భారత సైనికులతోపాటూ... చైనా సైనికులు కూడా చనిపోయారని తెలిపింది. ఎంత మంది చనిపోయారో సంఖ్యను బయటపెడితే... భారత కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని వరుస ట్వీట్లలో తెలిపింది. గత వారం ఘర్షణలో భారత్ నుంచి 20 మంది సైనికులు అమరులయ్యారు. గ్లోబల్ టైమ్స్ ట్వీట్ల ప్రకారం... చైనా నుంచి చనిపోయిన సైనికుల సంఖ్య 20 కంటే తక్కువే ఉంటుందనే అభిప్రాయం ఆ ట్వీట్లను బట్టీ వస్తోంది.


గ్లోబల్ టైమ్స్... భారత కేంద్ర ప్రభుత్వాన్ని తన ట్వీట్లలో విమర్శించింది. భారత సైనికుల కంటే... చైనా సైనికులే ఎక్కువ మంది చనిపోయారనే అంచనాని... భారత ప్రభుత్వ అధికారులు ప్రచారం చేస్తూ... ప్రజలను మభ్య పెడుతున్నారని అంది. ఇలాంటి ప్రకటనల ద్వారా దేశ ప్రజలను సంతృప్తి పరిచేందుకు ప్రయత్నిస్తున్నారని అంది.

ఈ వివాదాన్ని మరింత రాజేయడం ఇష్టం లేకపోవడం వల్లే చైనా... తమ సైనికులు ఎంత మంది చనిపోయారో లెక్క బయటపెట్టట్లేదని గ్లోబల్ టైమ్స్ తన ట్వీట్లలో తెలిపింది. చైనా గనక తన సంఖ్యను బయటపెడితే... భారత ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని అంది.

గాల్వాన్ ఘర్షణలో... చైనా సైనికులు 40 మంది కంటే ఎక్కువ మందే చనిపోయి ఉంటారని కేంద్ర మంత్రి, భారత ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్ శనివారం కామెంట్ చేశారు. మనం 20 మంది సైనికుల్ని కోల్పోయి ఉంటే... అటువైపు డబుల్ కంటే ఎక్కువ మందే చనిపోయి ఉండొచ్చు అని ఆయన అన్నారు.

చైనా ప్రభుత్వం ఇప్పటివరకూ అధికారికంగా ఎంత మంది చనిపోయిందీ చెప్పట్లేదు. గ్లోబల్ టైమ్స్ ఎడిటర్-ఇన్-చీఫ్ మాత్రం... చనిపోయింది నిజమే అని అంటున్నారు. గాల్వాన్ ఘర్షణలో చైనాకు గట్టి దెబ్బ తగిలింది కాబట్టే... చైనా ఎంత మంది చనిపోయిందీ చెప్పట్లేదని... ఆమ్‌స్టర్‌డామ్‌లోని యూరోపియన్ ఫౌండేషన్ ఫర్ సౌత్ ఆసియన్ స్టడీస్... తన రిపోర్టులో తెలిపింది. తైవాన్ సరిహద్దులతో పోల్చితే... భారత్-చైనా వాస్తవాధీన రేఖ వెంట చైనా బలగాలు బలహీనంగా ఉన్నాయని కూడా అంది.
First published: June 22, 2020, 12:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading