Home /News /india-china /

INDIA CHINA CONFLICT WHY THE REMOTE GALWAN VALLEY IS A FLASHPOINT BETWEEN INDIA AND CHINA NK

India-China : గాల్వన్ లోయపై చైనా కన్ను... అక్కడే ఎందుకు? ఏం జరుగుతోంది?

చైనాతో ఉద్రిక్తతల కారణంగా అధునాతన ఆయుధాలను సమకూర్చుకోవడంలో భారత రక్షణ శాఖ నిమగ్నమైంది. డ్రాగన్ దేశం కయ్యానికి కాలుదువ్వుతుండటంతో ఎలాంటి అనుమతులూ లేకుండానే రూ.500 కోట్ల లోపు ఆయుధాలను కొనుగోలు చేసుకునేందుకు భారత రక్షణ దళాలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది.

చైనాతో ఉద్రిక్తతల కారణంగా అధునాతన ఆయుధాలను సమకూర్చుకోవడంలో భారత రక్షణ శాఖ నిమగ్నమైంది. డ్రాగన్ దేశం కయ్యానికి కాలుదువ్వుతుండటంతో ఎలాంటి అనుమతులూ లేకుండానే రూ.500 కోట్ల లోపు ఆయుధాలను కొనుగోలు చేసుకునేందుకు భారత రక్షణ దళాలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది.

భారత్ పరిధిలో ఉన్న సరిహద్దు ప్రాంతం గాల్వన్ లోయ. ఎలాగైనా దాన్ని లాగేసుకోవాలని చైనా యత్నిస్తోంది. అసలు చైనా ఎందుకిలా చేస్తోంది?

    భారత్‌ - చైనా సరిహద్దుల్లో రెండు దేశాల సైనికుల మధ్య సోమవారం రాత్రి జరిగిన ఘర్షణకు గాల్వన్‌ లోయ కేంద్రమైంది. ఈ గాల్వన్ వివాదం ఇప్పటిది కాదు. 1962లో భారత్‌-చైనా మధ్య యుద్ధం జరిగిన ప్రాంతాల్లో గాల్వన్‌ కూడా ఉంది. గల్వాన్‌ లోయ దగ్గర భారత్‌‌కు చెందిన బోర్డర్‌ రోడ్ ఆర్గనైజేషన్‌... దర్బుక్‌-ష్యంకు- దౌలత్‌బేగ్‌ ఓల్డీకి 255 కిలోమీటర్ల హైవేని నిర్మిస్తోంది. ఈ హైవేపై ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ప్రయాణించే వీలుంది. ఈ రోడ్డు తిన్నగా... దౌలత్‌బేగ్‌ ఓల్డీ‌కి వెళ్లే రోడ్డును కలుస్తుంది. ఇది పూర్తైతే భారత సైనికులు అరగంటలోపే గాల్వన్‌ లోయకు వెళ్లగలరు. అదే రోడ్డు లేకపోతే 8 గంటలు పడుతుంది. ఇది గమనించిన చైనా... ఆ రోడ్డును నిర్మించడానికి వీల్లేదంటోంది. ఆ విషయాన్ని డైరెక్టుగా చెప్పకుండా... ఇలా... గాల్వన్‌ లోయలోకి ఆర్మీని పంపి... ఆ భూభాగం తనదే అంటోంది. ఇక్కడే రెండు దేశాల మధ్యా వివాదం నడుస్తోంది.

    గాల్వన్ లోయ (credit - google maps)


    తాజాగా... గాల్వాన్‌ లోయలోని ఓ ప్రదేశానికి చైనా బలగాలు రావడంతో... వెనక్కి వెళ్లాలని భారత బలగాలు కోరాయి. ఈ వివాదం ఐదు వారాలుగా నడుస్తోంది. కమాండర్ల స్థాయిలో చర్చలు జరిగాక... రెండువైపులా సైన్యం వెనక్కి వెళ్లాలని నిర్ణయం వెలువడింది. తీరా... వెనక్కి వెళ్తూ... చైనా సైన్యం రెచ్చగొట్టడంతో ఘర్షణ జరిగి రెండువైపులా ప్రాణ నష్టం జరిగిందని అంటున్నారు. గాల్వన్ లోయలో హైవే నిర్మాణ పనుల కోసం జార్ఖండ్‌ నుంచి 1600 కార్మికుల్ని భారత్ తరలించిన వెంటనే ఈ ఘర్షణ జరిగింది.

    గాల్వన్ లోయ (credit - google maps)


    గాల్వన్ లోయతోపాటూ... ఐదు వారాలుగా... ప్యాంగాంగ్ సరస్సు, దెమ్‌చోక్, దౌలత్‌బేగ్ ఓల్డీ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితి ఉంది. మే నుంచి చైనా... వాస్తవాధీన రేఖ (LAC) వెంట తన సైన్యాన్ని పెంచుతోంది. భారీగా యుద్ధ ట్యాంకుల్ని పంపింది. బంకర్లు నిర్మించింది. అదే సమయంలో నేపాల్ కొత్త మ్యాప్ తయారుచేసి... భారత భూభాగాల్ని తమవే అని చెప్పుకునేలా చేసింది. ఇదంతా చైనా ఓ వ్యూహం ప్రకారం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Indo China Tension

    తదుపరి వార్తలు