తూర్పు లద్ధఖ్‌లోని గాల్వన్ లోయ (credit - google maps)
భారత్ దురదృష్టమేంటంటే... ఓ ప్రమాదకర దేశం మన పక్కన ఉంది. ఆ దరిద్రగొట్టు డ్రాగన్... భారత అభివృద్ధిని చూసి కుళ్లిపోతోంది. ఏం చెయ్యలేక... ఇలాంటి కుయుక్తులకు పాల్పడుతోంది.
చైనా ఒకప్పుడు అరుణాచల్ ప్రదేశ్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టేది. ఇప్పుడు లడక్ ఆక్రమణకు దిగుతోంది. దీని వెనక బలమైన కారణాలు ఉన్నాయి. లడక్ వశమైతే... ఆసియాలో చైనాకు తిరుగుండదు. లడక్ ద్వారా... పాకిస్థాన్ ఆ తర్వాత... గల్ఫ్ దేశాలు, యూరప్ దేశాలతో రోడ్డు రవాణా, వాణిజ్య సంబంధాలు మెరుగుపరచుకోవడానికి చైనాకు ఎన్నో అవకాశాలు లభిస్తాయి. తద్వారా ఆసియాలో చైనా అత్యంత బలమైన దేశంగా మారి... అమెరికాకు పోటీగా నిలవగలదు. కానీ... ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా ఆ దేశం పరువు పోయింది. ప్రపంచ దేశాలన్నీ డ్రాగన్ ప్రమాదకర దేశం అని భావిస్తున్నాయి. అదే సమయంలో ఇండియాను మంచి దేశంగా చూస్తున్నాయి. దీనిపై అక్కసుతో... కుళ్లుబోతుల చైనా... భరించలేకపోతోంది. ఎలాగైనా భారత్‌కి నష్టం కలిగించాలని ఇలాంటి కుట్రలు పన్నుతోంది.
1962 యుద్ధానికి ముందు నుంచే చైనా కన్ను లడక్పై ఉంది. ఎత్తైన లడక్ మన ప్రాంతం కావడంతో ఇప్పుడు అక్కడ మన సైన్యానిదే పై చేయి అవుతోంది. అదే లడక్ తన వశమైతే... ఎత్తైన ప్రదేశానికి చేరి... మన సైన్యాన్ని తొక్కేయాలని కుట్రలు పన్నుతోంది సన్నాసి డ్రాగన్. ఇప్పటికే ఆక్సాయ్‌చిన్‌లో చాలా ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. అలాగే మనకు అనుకూలంగా ఉన్న గాల్వన్ లోయనూ లాగేసుకోవాలనుకుంటోంది. 1962 నుంచి తూర్పు లడక్‌లో చాలా ప్రాంతాలు తనవేనని దరిద్రపు చైనా చెప్పుకుంటోంది.
1962 యుద్ధం తర్వాత చైనా చాలా ఆక్రమణలకు పాల్పడింది. ఇప్పటికే లడక్ పైన ఉండే టిబెట్‌ను చైనా ఆక్రమించుకుంది. అయినప్పటికీ... చైనా సైన్యం ఆటలు సరిహద్దుల్లో సాగట్లేదు. ఇప్పుడు లడక్ని కూడా లాగేసుకుంటే... భారత్ మరింత బలహీనం అవుతుందని కుయుక్తులు పన్నుతోంది. దానికి తోడు... పక్కన ఉండే పాకిస్థాన్ పాలకులు కూడా చైనాకు సపోర్టుగా ఉన్నారు. తాజా ఘర్షణకు కూడా భారతే కారణమని కుళ్లుబోతుల పాకిస్థాన్ ఆరోపిస్తోంది. ఇలా రెండు శత్రుదేశాలతో భారత్ అప్రకటిత యుద్ధం చేయాల్సి వస్తోంది.
ఇలాంటివి చూసే... భారత్‌లో చైనా వస్తువుల అమ్మకాల్ని నిషేధించాలనే డిమాండ్లు వస్తున్నాయి. నిజమే... చైనా ఆర్థికంగా బలపడుతుండటానికి ప్రధాన కారణం ఇండియానే. మన దేశంలో చాలా వస్తువులు చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. వాటి వాడకాన్ని ప్రజలు ఆపేస్తే... అది చైనా ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ కొట్టినట్లే అవుతుంది. తద్వారా చైనాకు చెక్ పెట్టవచ్చు. అదే సమయంలో... చైనాలోని విదేశీ కంపెనీలను ఆకర్షించడం ద్వారా... చైనాకు మరో దెబ్బ కొట్టినట్లు అవుతుంది. ఇవేవీ చెయ్యకపోతే... చైనా బలపడుతూ... భారత్‌ని తొక్కేసేందుకు యత్నిస్తూనే ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
2016 నుంచి చైనా వాస్తవాధీన రేఖ (LAC) పక్కనే పెద్ద ఎత్తున రోడ్లు నిర్మిస్తోంది. పాకిస్థాన్ వైపుగా నిర్మిస్తున్న ఆర్థిక కారిడార్ రహదారి (CPEC) కూడా ఇక్కడకు దగ్గర్లోనే ఉంది. వీటి రక్షణకే వ్యూహాత్మకంగా భారత్‌తో సరిహద్దుల్లో ఘర్షణలకు దిగుతోంది. పాక్‌తో కలిసి తూర్పు, వాయవ్య ప్రాంతాల నుంచి భారత్‌ను ఎదుర్కొనేందుకు కుట్రలు పన్నుతోంది. సియాచిన్ గ్లేసియర్ నుంచి ఇండియా సైన్యాన్ని వెనక్కి పంపితే... కాశ్మీర్ మొత్తం తమ వశం అవుతుందనే దురాలోచనతో రెచ్చిపోతోంది దరిద్రగొట్టు బీజింగ్.
ప్రస్తుతం ఇండియా ఆర్థిక పరిస్థితి బాలేదు. కరోనా వల్ల చాలా నష్టపోతున్నాం. ఈ సమయంలో ఆక్రమణలకు దిగితే... భారత్ గట్టిగా అడ్డుకోలేదని చైనా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. మన సైన్యం ప్రాణాలకు తెగించి... డ్రాగన్‌కు చెక్ పెడుతుండటం గొప్ప విషయమే.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.