• HOME
  • »
  • NEWS
  • »
  • INDIA-CHINA
  • »
  • INDIA CHINA BORDER TENSIONS MIKE POMPEO MADE QUIET CALL TO S JAISHANKAR AFTER GALWAN VALLEY CLASH

India-China Tensions | మీకు అండగా మేమున్నాం...భారత్‌కు అమెరికా బాసట

India-China Tensions | మీకు అండగా మేమున్నాం...భారత్‌కు అమెరికా బాసట

అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో

India-China border tensions | గల్వాన్ లోయ ఘటన తర్వాత అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో భారత విదేశాంగ మంత్రి జయశంకర్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ఓ కథనంలో వెల్లడించింది. చైనాను ఎదుర్కొనే విషయంలో భారత్‌కు అండగా ఉంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

  • Share this:
    భారత్-అమెరికాల మధ్య మైత్రీ సంబంధాలు మునుపెన్నడూ లేనంతగా బలపడ్డాయి. భారత్-చైనాల మధ్య గల్వాన్ లోయలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌కు అగ్రరాజ్యం అండగా నిలుస్తోంది. తూర్పు లద్ధఖ్‌లోని గల్వాన్ లోయలో జూన్ 15 తేదీన భారత్-చైనా సేనల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణల్లో కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత జవాన్లు అమరులుకావడం తెలిసిందే. చైనా వైపు కూడా దీని కంటే ఎక్కువ సంఖ్యలో ప్రాణనష్టం జరిగింది. అయితే తమ జవాన్లు ఎంత మంది మరణించారో చైనా ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అమెరికా ఇంటెలిజన్స్ వర్గాల సమాచారం వరకు చైనా జవాన్లు దాదాపు 35 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది.

    గల్వాన్ లోయ ఘటన తర్వాత అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో భారత విదేశాంగ మంత్రి జయశంకర్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ఓ కథనంలో వెల్లడించింది. దాదాపు 10 రోజుల క్రితం పాంపియో...జయశంకర్‌తో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా చైనాను ఎదుర్కొనే విషయంలో భారత్‌కు అండగా నిలుస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు సమాచారం. ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇరు దేశాలు సైనిక, దౌత్య చర్చలు జరుపుతున్న తరుణంలోనే పాంపియో, జయశంకర్ మధ్య చర్చలు జరిగాయి. ‘వ్యూహాత్మక కారణాల’తో వీరిద్దరి మధ్య టెలిఫోన్ చర్చను బహిర్గతం చేయలేదని తెలుస్తోంది.

    భారత్-అమెరికాల మధ్య రక్షణ రంగ సహకారం, సమాచార మార్పిడి కారణంగా...ఎల్ఏసీ వెంబడి చైనా బలగాల మోహరింపునకు సంబంధించిన సమాచారాన్ని అమెరికా ఎప్పటికప్పుడు భారత్‌కు చేరవేస్తున్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక తన కథనంలో వెల్లడించింది.


    గల్వాన్ ఘటనపై స్పందించిన అమెరికా...తటస్థ వైఖరిని అవలంభిస్తూ తాము అక్కడి పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుత సమస్యకు శాంతియుత పరిష్కారం లభించాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది. అయితే ఆ తర్వాత పలు సందర్భాల్లో అమెరికా బాహటంగానే భారత్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేసింది. చైనాకు చెందిన యాప్స్‌ను భారత్ నిషేధించడాన్ని కూడా అమెరికా సమర్థించింది. చైనీస్ యాప్స్‌ను బ్యాన్ చేయడం భారత సమగ్రత, భద్రతకు దోహదపడుతుందని మైక్ పోపియో వ్యాఖ్యలు చేశారు.
    Published by:Janardhan V
    First published: