INDIA CHINA BORDER TENSIONS LIVE UPDATES INDIA NEEDS TO RID TWO MISJUDGMENTS ON BORDER SITUATION SAYS GLOBAL TIMES EDITORIAL NK
India-China : చైనా విషయంలో ఇండియా రెండు తప్పులు చేస్తోంది... గ్లోబల్ టైమ్స్ మాట
ఈ క్రమంలో చైనాకు చెందిన వారు చాలా ఎక్కువ మందే చనిపోయి ఉంటారని, లేదా గాయపడి ఉంటారని భావిస్తున్నారు.
India China Tensions : భారత్-చైనా మధ్య తాజా ఘర్షణ చెలరేగడంతో... దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్లోబల్ టైమ్స్ ఎడిటోరియల్... ఇండియాదే తప్పు అంటోంది.
India China Tensions : సోమవారం రాత్రి లడక్‌లోని గాల్వన్ లోయలో ఇండియా-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై... ఇండియన్లు... ఇండియన్ ఆర్మీని... చైనా ప్రజలు చైనా ఆర్మీని సమర్థించడం సహజం. ఐతే... దీనిపై ప్రపంచ దేశాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్లోబల్ టైమ్స్ ఎడిటోరియల్‌లో భారత్ రెండు తప్పులు చేస్తోందని కథనం ఇచ్చారు. దాని ప్రకారం... భారత్... సరిహద్దుల వెంట బలమైన నిర్మాణాలు చేపడుతోంది. మౌలిక సదుపాయాలు కల్పించుకుంటోంది. ఐతే... ఇలా నిర్మించేటప్పుడు... అక్కడక్కడా వాస్తవాధీన రేఖకు అటువైపున చైనా ప్రాంతంలో కూడా నిర్మిస్తోంది. ఈ విషయంలో రెండు దేశాల మధ్య ఉన్న సరిహద్దు వివాదాలు, ద్వైపాక్షిక విబేధాలను భారత్ పట్టించుకోవట్లేదు. ఫలితంగా రెండు వైపులా... అదే పనిగా... ఘర్షణలు తలెత్తుతున్నాయి. చైనా సైనికులు... భారత సైనికుల దూకుడును ఆపేందుకు ప్రయత్నిస్తున్నారని గ్లోబల్ టైమ్స్ ఎడిటోరియల్ తెలిపింది.
చైనా-ఇండియా మధ్య సరిహద్దు ఘర్షణలు జరగడానికి భారత దేశ అహంకారం, నిర్లక్ష్యవైఖరే కారణమవుతోందని గ్లోబల్ టైమ్స్ ఎడిటోరియల్ అంటోంది. కొన్నేళ్లుగా... సరిహద్దు అంశాల్లో భారత కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందనీ... ఇందుకు రెండు తప్పుడు అభిప్రాయాలే కారణం అని తెలిపింది.
చైనా... భారత్‌తో సంబంధాల్ని తెగదెంపులు చేసుకోవాలనే ఉద్దేశంతో లేదనీ... ఎందుకంటే... చైనాపై అమెరికా వ్యూహాత్మక ఒత్తిడి ఉందనీ గ్లోబల్ టైమ్స్ ఎడిటోరియల్ అంటోంది. అందువల్ల చైనా... ఇండియా వైపు నుంచి దూకుడు ఉన్నప్పటికీ... తమవైపు నుంచి రెచ్చగొట్టే పరిస్థితి లేకుండా చూసుకుంటోందని తెలిపింది. కొంతమంది భారతీయులు... చైనా కంటే భారత మిలిటరీయే శక్తిమంతమైనదని తప్పుగా అభిప్రాయపడుతున్నారనీ... ఈ తప్పుడు అభిప్రాయాలు... భారత దేశాన్ని దూకుడుగా మార్చి... సరిహద్దుల్లో టెన్షన్లు పెంచి... ఇండియా-చైనా పాలసీకి సమస్యగా మారుతున్నాయని గ్లోబల్ టైమ్స్ ఎడిటోరియల్ కథనం రాసింది.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.