చైనా ఉత్పత్తులకు ప్రచారం చేయకండి...సెలబ్రిటీలకు వినతి

India-China Border Tensions | భారత సెలబ్రిటీలు వివో, రియల్‌మీ, ఒప్పో, క్సియోమి, ఎంఐ తదితర చైనా ఉత్పత్తులకు ప్రచారకర్తలుగా ఉన్నారు.

news18-telugu
Updated: June 19, 2020, 8:11 AM IST
చైనా ఉత్పత్తులకు ప్రచారం చేయకండి...సెలబ్రిటీలకు వినతి
ప్రతీకాత్మక చిత్రం (Image;Twitter)
  • Share this:
తూర్పు లద్ధాఖ్‌లోని గాల్వన్ లోయలో కయ్యానికి కాలుదువ్విన చైనా సేనలు...మన దేశానికి చెందిన కల్నల్ సంతోష్ బాబుతో పాటు 20 మంది సైనికులను బలితీసుకోవడం పట్ల దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కయ్యాలమారి చైనాకు దానికి అర్థమయ్యే భాషలోనే ధీటుగా సమాధానం ఇవ్వాలన్న డిమాండ్‌తో పాటు ‘బాయ్‌కాట్ చైనా’ నినాదం జోరుగా వినిపిస్తోంది.  చైనాను ఆర్థికంగా చావు దెబ్బతీసేందుకు ఆ దేశ ఉత్పత్తులను పూర్తిగా బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరు ఆందోళనకారులు చైనాలో తయారైన టీవీలు, మొబైల్ ఫోన్లను పగలగొట్టి మరీ తమ నిరసన తెలిపారు. ప్రజలు ఎవరూ ఒప్పో, రెడ్‌మీ, రియల్‌మీ తదితర చైనా తయారిత మొబైల్ ఫోన్లు, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయొద్దని సూచిస్తున్నారు.

ఈ నేపథ్యంలో భారత సెలబ్రిటీలు ఎవరూ చైనా ఉత్పత్తులకు ప్రచారకర్తలుగా వ్యవహరించొద్దని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ) కోరింది. గాల్వన్ లోయలో దేశం కోసం ప్రాణాలర్పించిన అమర సైనికులకు సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ అమీర్ ఖాన్, దీపిక పదుకొనె, కత్రినా కైఫ్, విరాట్ కోహ్లీ తదితరులకు సీఏఐటీ బహిరంగ లేఖ రాసింది. అలాగే చైనా ఉత్పత్తుల వ్యతిరేక ప్రచారం(బాయ్‌కాట్ చైనా)లో పాలు పంచుకోవాలని అమితాబ్ బచ్చన్, అక్షయ్ కపూర్, శిల్పా శెట్టి, మాధురీ దీక్షిత్, మహేంద్ర సింగ్ ధోనీ, సచిన్ టెండుల్కర్ తదితరులను సీఏఐటీ కోరింది. చైనా ఉత్పత్తుల బహిష్కరణకు దేశ వ్యాప్త ఉద్యమం అవసరమని సూచించింది. భారత సెలబ్రిటీలు వివో, రియల్‌మీ, ఒప్పో, క్సియోమి, ఎంఐ తదితర చైనా ఉత్పత్తులకు ప్రచారకర్తలుగా ఉన్నారు.

ప్రతీకాత్మక చిత్రం


ప్రస్తుతం చైనా నుంచి భారత్ దిగుమతుల వార్షిక విలువ 70 బిల్లియన్ డాలర్లు(రూ.5.25 లక్షల కోట్లు)గా ఉంది. ప్రజలు, వ్యాపారుల సహకారంతో చైనా నుంచి దిగుమతులను 2021నాటికి 13 బిల్లియన్ డాలర్లు(రూ.1 లక్ష కోట్లు) మేర తగ్గించాల్సిన అవసరం ఉందని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖందెల్‌వాల్ అన్నారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు తమ సహకారం ఉంటుందన్నారు.

భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చైనా ఉత్పత్తుల హవా సాగుతోంది. మేడిన్ చైనా స్మార్ట్ ఫోన్లలో ఏయే మొబైల్ ఎంత మేరకు అమ్ముడుపోతోందో చూడండి.

చైనాలో అత్యధికంగా అమ్ముడుపోతున్న మేడిన్ చైనా మొబైల్ ఫోన్లు


భారత స్మార్ట్‌ఫోన్ విపణిలో చైనా ఉత్పత్తుల హవా
First published: June 19, 2020, 8:03 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading