INDIA CHINA BORDER TENSION CHINESE MILITARY BRINGS HEAVY CONSTRUCTION EQUIPMENT HUNDREDS OF SOLDIERS INTO GALWAN VALLEY
భారత్‌ను రెచ్చగొడుతున్న కయ్యాలమారి..గాల్వన్ లోయలో భారీగా చైనా సేనలు
(Image: Planet Labs via AP)
India-China Border Tension | కుక్క తోక వంకర అన్నట్లు డ్రాగన్ దేశం కయ్యానికి కాలుదువ్వుతోంది. తూర్పు లద్ధఖ్‌లో భారత సేనలను చైనా మరింత రెచ్చగొడుతోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచేలా దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది.
కుక్క తోక వంకర అన్నట్లు డ్రాగన్ దేశం కయ్యానికి కాలుదువ్వుతోంది. తూర్పు లద్ధఖ్‌లో భారత సేనలను చైనా మరింత రెచ్చగొడుతోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచేలా దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. తూర్పు లద్ధఖ్‌లోని గాల్వన్ లోయలో సోమవారం భారత్-చైనా సేనల మధ్య జరిగిన ఘర్షణల్లో తెలుగు ముద్దుబిడ్డ కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత సైనికులు వీరమరణం చెందడం తెలిసిందే. పలువురు గాయపడగా నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చైనా వైపున కూడా భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరిగింది. ఈ నేపథ్యంలో గ్వాలన్ లోయ వద్దకు వందల సంఖ్యలో తమ సైనికులను కయ్యాలమారి చైనా తరలించినట్లు తెలుస్తోంది. అలాగే భారీ స్థాయిలో కన్స్ట్రక్షన్ యంత్రాలను కూడా అక్కడకు తరలిస్తున్నట్లు ప్లానెట్ ల్యాబ్స్ విడుదల చేసిన తాజా ఉపగ్రహ శాటిలైట్ ఫోటోల ద్వారా తెలుస్తోంది. పట్రోల్ పాయింట్ 14 వద్ద భారీ సంఖ్యలో వాహనాలు ఉన్నట్లు శాటిలైట్ ఫోటోల ద్వారా తేటతెల్లం అవుతోంది. దాదాపు 3 కిలో మీటర్ల దూరం భారత్ భూభాగంలోకి చైనా సేనలు చొచ్చుకొచ్చినట్లు భావిస్తున్నారు.
గాల్వన్ లోయ శాటిలైట్ ఫోటోలో(Image: Planet Labs via AP)
దాదాపు 800 మందికి పైగా పీపుల్స్ రిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) సైనికులు పట్రోల్ పాయింట్ 14 వద్ద ప్రస్తుతం ఉన్నట్లు తెలుస్తోంది. 15వ తేదీన రాత్రి ఇరు దేశాల సేనల ఘర్షణ తర్వాత అక్కడ ఉద్రిక్తతలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ఇరు దేశాలు అంగీకరించిన తర్వాత కూడా కయ్యాలమారి చైనా ఇలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. వివాదాస్పద గాల్వన్ లోయను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం చైనా సేనల వ్యూహం కావచ్చని రక్షణ శాఖ నిపుణులు భావిస్తున్నారు. గాల్వన్ లోయపై తమకే పూర్తి అధికారం ఉందని దురంహకార చైనా ఇప్పటికే తనకు తానుగా ప్రకటించుకుంది.
తూర్పు లద్ధఖ్‌లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాల మధ్య బుధవారం జరిగిన మేజర్ జనరల్ స్థాయి చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. సేనల ఉపసంహరణకు సంబంధించి ఈ చర్చల్లో ఎలాంటి ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. త్వరలోనే ఇరుపక్షాల మధ్య మరోదఫా సమావేశం జరగనుంది.
Published by:Janardhan V
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.