INDIA CHINA BORDER ISSUE US SLAMS CHINA FOR BORDER FIGHT WITH INDIA SK
India-China: భారత్ పట్ల చైనా తీరుపై అమెరికా ఆగ్రహం.. రోగ్ యాక్టర్
ప్రతీకాత్మకచిత్రం
సరిహద్దు దేశాలతో చైనా కయ్యానికి కాలుదువ్వడం సమంజసం కాదని యునైటెడ్ స్టేల్స్ సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ మైక్ పాంపియో విమర్శలు గుప్పించారు. డ్రాగన్ కంట్రీ రోగ్ యాక్టర్లా వ్వహరిస్తోందని మండిపడ్డారు.
పక్క దేశాల పట్ల చైనా వ్యవహరిస్తున్న తీరుపై యావత్ ప్రపంచం విమర్శలు గుప్పిస్తోంది. ఇప్పటికే కరోనా వైరస్ అపకీర్తి మూటగట్టుకున్న చైనా.. ఇప్పుడు భారత్‌తో కయ్యంతో మరింత అప్రతిష్ట పాలవుతోంది. భారత్-చైనా సరిహద్దుల్లో జరగిన ఘర్షణపై అమెరికా మరోసారి ఘాటుగా స్పందించింది. పొరుగు దేశాలతో డ్రాగన్ వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా తప్పుబట్టింది. ప్రపంచ దేశాలు శాంతి కోరుకుంటుంటే.. సరిహద్దు దేశాలతో చైనా కయ్యానికి కాలుదువ్వడం సమంజసం కాదని యునైటెడ్ స్టేల్స్ సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ మైక్ పాంపియో విమర్శలు గుప్పించారు. డ్రాగన్ కంట్రీ రోగ్ యాక్టర్లా వ్వహరిస్తోందని మండిపడ్డారు. శుక్రవారం డెన్మార్క్‌తో నిర్వహించిన ఓ వీడియో కాన్ఫరెన్స్లొో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత జవాన్లపై చైనా ఆర్మీ దాడి చేసిన తీరును తీవ్రంగా ఖండించారు మైక్ పాంపియో. జనాభా పరంగా రెండు అతి పెద్ద దేశాల మధ్య ఘర్షణపూరితమైన వాతావరణం ఇరుపక్షాలకు నష్టం చేకూర్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా రూపంలో ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్లో చైనా అవలంభిస్తున్న విధానం సహేతుకమైనది కాదని విరుచుకుపడ్డారు. హాంకాంగ్ స్వేచ్ఛా స్వాతంత్రంపై చైనా గుత్తాధిపత్యం ఆ దేశ పౌరులకు పెను ప్రమాదమని హెచ్చరించారు పాంపియో. పక్క దేశ పౌరుల స్వేచ్ఛను హరించే హక్కు చైనాకు లేదని మండిపడ్డారు. అంతేకాదు దక్షిణ చైనా సముద్రం, జపాన్, మలేషియా దేశాలతో చైనా వివాదాలను సైతం ఆయన తప్పుబట్టారు.
కాగా, జూన్ 15, 16 తేదీల్లో గల్వాన్ లోయలో భారత్, చైనా జవాన్ల మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘటనలో కల్నల్ సంతోష్ బాబ సహా 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. చైనాకు చెందిన 43 మంది సైనికులు మరణించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఐతే చైనా మాత్రం అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఐతే 20 మంది సైనికులు మరణించడాన్ని భారత్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. చైనాను ఎలా దెబ్బకొట్టాలన్న దానిపై వ్యూహాలు రచిస్తోంది. తామ శాంతికాముకులమని.. కానీ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని ప్రధాని హెచ్చరించారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.