India-Chia: లఢక్‌లో నక్కజిత్తుల చైనా మాస్టర్ ప్లాన్ అదేనా?

ప్రతీకాత్మక చిత్రం

India-Chia Clash: ఛాన్స్ దొరికితే లఢక్‌ని ఆక్రమించుకోవాలని చైనా కుట్రలు, కుతంత్రాలూ పన్నుతోంది. పైకి స్నేహం అంటూనే తెరవెనక గోతులు తవ్వుతోంది. అసలు చైనా ప్లానేంటో తెలుసుకుందాం.

 • Share this:
  India-Chia Clash: భారత్‌కి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మన దేశమంటే చైనాకి పడట్లేదు. ఎప్పుడూ ఏదో ఒక రకంగా భారత భూభాగాల్ని లాక్కోవాలని యత్నిస్తూనే ఉంది. జూన్ 15న ఘర్షణలో 20 మంది సైనికుల్ని భారత్ కోల్పోయేందుకు కారణమైన చైనా... తాజాగా శనివారం రాత్రి మరోసారి ప్యాంగాంగ్ సరస్సు దగ్గర దక్షిణ ప్రాంతంలోని భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు యత్నించింది. నిజానికి రెండు దేశాల మధ్య ఉన్న వాస్తవాధీన రేఖ (LAC) దగ్గర ఎలాంటి మార్పులూ ఉండకూడదని రెండు దేశాలూ తాత్కాలిక ఒప్పందం చేసుకున్నాయి. డ్రాగన్ మాత్రం ఆ ఒప్పందాన్ని గాలికి వదిలేసి... మాటిమాటికీ భారత భూభాగాల్ని లాక్కోవాలని కుట్రలు పన్నుతోంది.

  ఇన్నాళ్లూ ప్యాంగాంగ్ ఉత్తర ప్రాంతంలోని భూభాగంపై కన్నేసిన చైనా... ఇప్పుడు తొలిసారిగా దక్షిణం వైపు వచ్చింది. భారత సైన్యం బలంగా తిప్పికొట్టడంతో... చైనా ఎత్తుగడ పారలేదు. సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణాలు, క్షిపణి కేంద్రాల్ని ఏర్పాటు చేస్తున్న బీజింగ్... ఏదో ఒకటి చేసి... ప్యాంగాంగ్ సరస్సు దగ్గర సరిహద్దుల్ని మార్చేయాలని యత్నిస్తోంది. భారత ప్రభుత్వం చర్చల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవాలని చూస్తుంటే... చైనా మాత్రం కవ్వింపు చర్యలకు దిగి... ఇండియన్ ఆర్మీని రెచ్చగోడుతోంది.

  లఢక్‌తోపాటూ... వాస్తవాధీన రేఖ దగ్గర చాలాచోట్ల చైనా సైన్యం ఇప్పటికీ తిష్టవేసే ఉంది. వెనక్కి రప్పించుకుంటామని నెల కిందట చెప్పిన చైనా పాలకులు... ఆ మాట నిలబెట్టుకోవట్లేదు. చెప్పేదొకటి, చేసేదొకటి. తాజా ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఉన్నతాధికారులతో సమీక్షించారు. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్‌ దోవల్‌, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (CDS) జనరల్‌ బిపిన్‌ రావత్‌, త్రివిధ దళాల అధికారులు కూడా సమీక్షించారు.

  పాంగాంగ్‌ దక్షిణ తీరం దగ్గర సరిహద్దులను మార్చాలన్న కుట్రకు ఒకరోజు ముందే చైనా సైన్యం తన ఎయిర్‌బే‌స్‌లో జే-20 యుద్ధ విమానాలను ఉంచింది. లఢక్ దగ్గర్లోని కాస్ఘర్‌, హోటన్‌, గారిగున్సాతోపాటు ఎల్‌ఏసీ వెంట ఉన్న ఇతర ప్రాంతాల్లో చైనా వైమానిక దళం యాక్టివ్‌గా ఉంది. ప్యాంగాంగ్‌ సరస్సు 604 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. దాని పొడవు దాదాపు 134 కిలోమీటర్లు. వెడల్పు 5 కిలోమీటర్లు. 1962 యుద్ధం తర్వాత ఎల్‌ఏసీని రెండు దేశాల సరిహద్దుగా గుర్తించారు. సరస్సు మీద నుంచి ఎల్‌ఏసీ ఉంది. ప్యాంగాంగ్‌కు ఉత్తర తీరంలోని పర్వతాల్ని ‘ఫింగర్స్‌’ అంటారు. ఫింగర్‌-8 మీదుగా ఎల్‌ఏసీ వెళ్లగా... భారత్‌కు ఫింగర్‌-4 వరకే పట్టుంది. చైనా సైన్యానికి ఫింగర్‌-8 దగ్గర పోస్టు ఉంది. అయినా భారత్‌ వైపున ఫింగర్‌-2 వరకు ఉన్న భూభాగమంతా తనదేనని డ్రాగన్ వాదిస్తోంది. సరస్సులో మర బోట్లతో తిరుగుతూ భారత జలాల్లోకి వస్తోంది. అందుకే భారత్‌ అక్కడ పెట్రోలింగ్‌ను పెంచింది.

  చైనాలో ఆర్థిక పరిస్థితులు బాలేవు. పైగా... పాలకులపై ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు చైనా ఇలా సరిహద్దు వివాదాల్ని రేపుతున్నట్లు తెలుస్తోంది. భారత్ లాగా చాలా దేశాలు చైనా ఉత్పత్తులకు చెక్ పెడుతున్నాయి. దానికి తోడు చైనా వృద్ధిరేటు బాగా పడిపోయింది. ఆహార కొరత బాగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చైనా భారత్‌ని టార్గెట్ చేస్తూ... నాటకాలాడుతోంది. కేంద్ర ప్రభుత్వం, ఆర్మీ అప్రమత్తంగా ఉండటం వల్ల చైనా ఆటలు మన దగ్గర సాగట్లేదు.
  Published by:Krishna Kumar N
  First published: