Home /News /india-china /

INDIA BLOCKS CHINAS ATTEMPT TO ALTER STATUS QUO IN LADAKHS PANGONG LAKE NK

India-Chia Clash: మళ్లీ భారత్-చైనా మధ్య ఘర్షణ... బలంగా తిప్పికొట్టిన ఇండియన్ ఆర్మీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

India-Chia Clash: భారత్ అభివృద్ధిని చూసి చైనా తట్టుకోలేకపోతోంది. ఎలాగైనా ఇండియాని దెబ్బకొట్టాలని సరిహద్దుల్లో రెచ్చిపోతోంది. తాజాగా మరోసారి ఘర్షణకు దిగింది.

    India-Chia Clash: ఇదివరకు ఇండియాకి పాకిస్థాన్ పక్కలో బల్లెం లాంటిది అనుకునేవాళ్లు. ఇప్పుడు అసలు పక్కలో బల్లెం చైనా అని అర్థమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర భారత్ నినాదం అందుకోవడంతో... చైనా చచ్చిపోతోంది. ఏం చేసైనా ఇండియాను నాశనం చేయాలనే దుర్బుద్ధితో... సరిహద్దుల్లో రెచ్చిపోతోంది. తాజాగా తూర్పు లడఖ్ ప్యాంగ్ యాంగ్ దగ్గర మరోసారి రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. ఈసారి కూడా ఈ ఘర్షణకు కారణం చైనానేనని తేలింది. తూర్పు లడఖ్‌లో మరోసారి చైనా సైన్యం దూకుడు ప్రదర్శించింది. రెండు దేశాల ఒప్పందాన్ని గాలికి వదిలేసి... ఆక్రమణకు యత్నించింది డ్రాగన్ ఆర్మీ. ఇది గమనించిన ఇండియన్ ఆర్మీ... "ఏయ్" అంటూ... గట్టిగా ఎదురునిలిచింది. "నువ్వెంత... నువ్వెంత" అనే టైపులో పెద్ద ఘర్షణే జరిగింది. చివరకు చైనా సైన్యాన్ని భారత ఆర్మీ బలంగా తిప్పికొట్టింది. ఇండియన్ ఆర్మీ ధైర్యాన్ని చూసి... చైనా ఆర్మీ తెగ కుళ్లుకుంటూ... తమ ప్లాన్ వర్కవుట్ అవ్వలేదే అని తెగ బాధపడిపోతోంది.

    బీజింగ్ పాలకులు నానాటికీ కుళ్లుబోతుల్లా మారుతున్నారు. భారత సైన్యాన్ని రెచ్చగొట్టేస్తే... ఏదో ఒకటి అయిపోతుందనీ, తద్వారా... ఇండియాకి భారీగా నష్టం చేసేయవచ్చని కుట్రలు పన్నుతున్నారు. మొన్నటికి మొన్న ఇంకేముంది... మా సైన్యాన్ని వెనక్కి తీసుకుపోతున్నామని చెప్పిన చైనా పాలకులు... వాస్తవంలో మాత్రం అలా చెయ్యకుండా... కొన్ని చోట్ల సైన్యాన్ని అలాగే ఉంచారు. ఆ సైన్యమే ఇలా రూల్స్ బ్రేక్ చేసి కయ్యానికి కాలు దువ్వుతోంది. తాజా ఘటన ప్యాంగాంగ్ సో‌కి దక్షిణం వైపు జరిగినట్లు కేంద్రం తెలిపింది. ఆగస్ట్ 29, 30 మధ్య అర్థరాత్రి సమయంలో ఇది జరిగినట్లు తెలిసింది.

    అమెరికా ఒత్తిడితో ఈమధ్యే చైనా తల దించింది. భారత్‌తో స్నేహం వల్ల రెండు దేశాలూ అభివృద్ధి చెందుతాయని నాటకాలు ఆడింది. పైకి అలా అంటూనే... తెరవెనక లఢక్ భూభాగాన్ని లాగేసుకోవాలని భారీగా కుట్రలు పన్నుతోంది డ్రాగన్ కంత్రీ కంట్రీ. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అలర్ట్ గానే ఉంది. చైనా తోక జాడిస్తే కట్ చేయడానికి వీలుగా... సరిహద్దుల్లో భారీగానే సైన్యాన్ని మోహరిస్తోంది. అంతేకాదు... దక్షిణ చైనా సముద్రంలో కూడా మన యుద్ధనౌకను భారత్ మోహరించింది. చైనా ఏమాత్రం ఎక్స్‌ట్రాలు చేసినా... అన్ని వైపుల నుంచి భారత్ గట్టిగా తిప్పికొట్టేలా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా పక్కన ఇలాంటి దరిద్రపు దేశం ఉంటే... అభివృద్ధి చెందడం చాలా కష్టం. ముఖ్యంగా ఆత్మనిర్భర భారత్ నినాదం తర్వాత... తమ వస్తువుల్ని భారతీయులు కొనట్లేదని డ్రాగన్ ఉడుకెత్తిపోతోంది. దాని ఫలితమే ఈ రెచ్చిపోవడాలు. ఇలాగే చేస్తూ ఉంటే... అంతర్జాతీయంగా చైనాకి గట్టి దెబ్బ తగలడం ఖాయమంటున్నారు నిపుణులు.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: India-China

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు