INDIA BEGINS CONSTRUCTION OF EMERGENCY AIRSTRIP IN SOUTH KASHMIR AMID STANDOFF WITH CHINA IN LADAKH REGION NK
కాశ్మీర్లో భారత్ ఎమర్జెన్సీ ఎయిర్‌స్ట్రిప్ నిర్మాణం... చైనాకి చెక్ పెట్టేందుకే...
చైనా దొంగ బుద్ధి... సరిహద్దుల్లో హింస... ఓ సైనికాధికారి, ఇద్దరు జవాన్ల మృతి...
డ్రాగన్ అనే పురాణ జీవి చాలా మంచిది. దాన్ని తమకు చిహ్నంగా చెప్పుకునే చైనా... కుట్రపూరిత చర్యల్ని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఎయిర్‌స్ట్రిప్ నిర్మిస్తోంది. దీని విశేషాలేంటి?
భారత్. చైనా మధ్య లడక్‌లో వివాదం కొనసాగుతుండటం, రోజురోజుకూ చైనా ఆయుధాల్నీ, సైన్యాన్నీ పెంచుతుంటడంతో... భారత కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. భారత నేషనల్ హైవే అధారార్టీ (NHAI)ని కాశ్మీర్లో ఓ ఎయిర్‌స్ట్రిప్ నిర్మించమని కేంద్రం ఆదేశించింది. ఇదో ఎమర్జెన్సీ ల్యాండింగ్ స్ట్రిప్. దక్షిణ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో దీన్ని నిర్మించబోతున్నారు. ఫైటర్ జెట్లు ఇక్కడ దిగేందుకూ, టేకాఫ్ అయ్యేందుకూ వీలుగా దీన్ని నిర్మించనున్నారు. జియాలజీ, మైనింగ్ విభాగాలు ఇచ్చిన నోటీస్ ప్రకారం... 3.5 కిలోమీటర్ల పొడవైన ఎమర్జెన్సీ ల్యాండింగ్ సదుపాయాన్ని NHAI నిర్మించబోతున్నట్లు తెలిసింది. ఇప్పటికే భూమిని చదును చేసే పని మొదలైంది. ఈ పనిలో పాల్గొనేవారికి ప్రత్యేక పాస్‌లు కూడా జారీ చేశారు.
ఈ ప్రాజెక్టు కోసం పర్యావరణ విభాగం నుంచి అనుమతులు పొందాల్సిన అవసరం లేదని నోటీస్‌లో ఉంది. ఐతే... శ్రీనగర్ హైవేపై ఆల్రెడీ ఓ ల్యాండింగ్ స్ట్రిప్ ఉంది. దానికీ దీనికీ సంబంధం లేదన్న అధికారులు... దీన్ని చైనా దృష్ట్యా నిర్మించట్లేదనీ... కాశ్మీర్లో మొదలైన మరో నేషనల్ హైవే నిర్మాణంలో భాగంగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే కాశ్మీర్లో శ్రీనగర్, అవంతుపురలో రెండు ఎయిర్‌స్ట్రిప్‌లు ఉన్నాయి. ఇది మూడోది.
మొదటి నుంచి భారత దేశ సరిహద్దులపై కన్నేసిన చైనా... వాటిని ఆక్రమించుకోవడం ద్వారా... ఈశాన్య రాష్ట్రాలపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే టిబెట్, హాంకాంగ్‌పై చైనా ఆధిపత్యం చెలాయిస్తోంది. ఆ రెండు దేశాల ప్రజలూ... చైనాను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్ తమదే అని చెప్పుకుంటూ చైనా... అక్కడకు భారతీయ నేతలెవరైనా వెళ్తే... ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తోంది. ఇప్పుడు... లడక్ని ఆక్రమించుకోవడం ద్వారా... పాకిస్థాన్‌కు ప్రత్యేక రవాణా మార్గాల్ని అభివృద్ధి చేసుకునే కుట్ర పనుతున్నట్లు తెలిసింది. ఒక వేళ చైనా యుద్ధానికి దిగితే... దీటుగా ఎదుర్కోవడానికి భారత్ సర్వ సన్నద్ధం అవుతోంది.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.