యుద్ధానికి సిద్ధం... ఇండియా-చైనా సరిహద్దుల్లో సర్వ సన్నద్ధం... ఏ క్షణంలోనైనా...

పైకి చైనా యుద్ధం లేదంటునే... మరోవైపు యుద్ధానికి అన్నీ రెడీ చేస్తోంది. లాభం లేదనుకున్న ఇండియా కూడా తడాఖా చూపించేందుకు సిద్ధమవుతోంది.

news18-telugu
Updated: June 29, 2020, 7:04 AM IST
యుద్ధానికి సిద్ధం... ఇండియా-చైనా సరిహద్దుల్లో సర్వ సన్నద్ధం... ఏ క్షణంలోనైనా...
యుద్ధానికి సిద్ధం... ఇండియా-చైనా సరిహద్దుల్లో సర్వ సన్నద్ధం... ఏ క్షణంలోనైనా... (credit - twitter)
  • Share this:
భారత్-చైనా మధ్య కొద్దిగా పెద్ద యుద్ధమే జరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. జూన్ 15న రాత్రివేళ కుట్రపూరితంగా భారత్ సైనికుల మరణాలకు కారణమైన చైనా... ఆ తర్వాత కూడా తీరు మార్చుకోలేదు. భారత్‌తో జరిగిన చర్చల్లో తమ సైన్యాన్ని వెనక్కి తీసుకుంటామనీ... భారత సైన్యం కూడా వెనక్కి వెళ్లాలని చెప్పిన చైనా... ఆ మాట నిలబెట్టుకోలేదు సరికదా... మరింత ఎక్కువగా ఆయుధ సామగ్రిని సరిహద్దులకు చేరవేస్తోంది. ఇదంతా చూస్తున్న ఇండియా... ఈ చైనా బుద్ధి మారదు అనుకుంటూ... మరింతగా సైన్యాన్ని సరిహద్దుల దగ్గర మోహరిస్తోంది. తాజాగా మన్‌ కీ బాత్‌లోనూ ప్రధాని మోదీ... చైనాను ఘాటుగా హెచ్చరించడానికి కారణం... చైనా చేస్తున్న కుతంత్రాలే.

తాజాగా చైనాకు చెక్ పెట్టేందుకు భారత్... ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ బేస్‌ల నుంచి భారీగా ఆయుధ వ్యవస్థల్ని లడక్‌కు పంపుతోంది. అటు చైనా ఆల్రెడీ రెండు నెలలుగా ఆయుధాల్ని చేరవేస్తూనే ఉంది. దానికి తోడు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ (POK)లో చైనా సైనిక దళ కార్యకలాపాలు నడుస్తున్నాయి. చైనా అక్కడి స్కర్దూ స్థావరంలో ఓ ట్యాంకర్ విమానాన్ని ఉంచింది. ఇది ఎలాంటిదంటే... గాలిలో వెళ్లే యుద్ధ విమానాలకు ఇంధనాన్ని ఇస్తుంది. అంటే... చైనా యుద్ధవిమానాలు... లడక్ వైపు వస్తూ... గగనతల దాడులు చేసేందుకు రెడీ అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. యుద్ధం చేస్తే... POK ద్వారా కూడా యుద్ధం చేసేందుకు చైనా సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.

చైనా సైన్యానికి భారత దేశ సరిహద్దుల్లో యుద్ధంపై పెద్దగా పట్టు లేదు. అక్కడి ఎత్తైన పర్వతాలపై చైనా సైన్యం బలంగా యుద్ధం చెయ్యలేదు. అదే సమయంలో భారత సైన్యానికి పాకిస్థాన్‌తో సరిహద్దుల్లో రోజూ చిన్నపాటి యుద్ధాలు చేసీ చేసీ సరిహద్దుల్లో యుద్ధాలపై పట్టు పెరిగింది. ఇది గమనించిన చైనా... యుద్ధ విమానాలతో యుద్ధం చేయాలనే ప్లాన్ వేస్తున్నట్లు కనిపిస్తోంది.

నిజానికి ఇది ఏడాది నుంచి చైనా వేసిన ప్లాన్‌గా తెలుస్తోంది. ఇందులో భాగంగానే... పాకిస్థాన్ గత ఏడాదే POKలోని స్కర్దూ స్థావరాన్ని... J 17 విమానాలకు అనుకూలంగా ఉండేలా డెవలప్ చేసింది. ఇప్పుడు ఆ ప్రదేశం చైనా వాడుకుంటోంది.

చైనా కుయుక్తుల్ని ముందే కనిపెట్టిన భారత్... ఈమధ్యే 21 మిగ్ 29 యుద్ధ విమానాలు, 12 సుఖోయ్ యుద్ధవిమానాల కోసం ఆర్డర్ ఇచ్చింది. చైనాతో ఆకాశంలో కూడా యుద్ధం చేసేందుకు భారత్ సర్వ సన్నద్ధం అవుతోంది. ప్రస్తుతానికైతే... చైనాలో కంటే ఇండియాలోనే పవర్‌ఫుల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. ఐతే... ఓవరాల్‌గా మాత్రం సైన్యం, యుద్ధ సామాగ్రి... భారత్‌లో కంటే చైనా దగ్గరే చాలా ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ... చైనాకి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా మన సైన్యం తాడోపేడో తేల్చుకునేందుకు రెడీ అవుతున్నట్లు పరిస్థితుల్ని బట్టీ అర్థమవుతుంది. యుద్ధం జరుగుతుందా అనేందుకు కచ్చితంగా ఎలాంటి అధికారిక సంకేతాలూ లేవు. కానీ... జరుగుతున్న పరిణామాలూ, సరిహద్దుల్లో కదలికల్ని బట్టీ... నిపుణులు ఈ అంచనా వేస్తున్నారు.
First published: June 29, 2020, 7:04 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading