భారత్ చైనా మధ్య ఉద్రిక్తతలకు చెక్?... సరిహద్దు సమస్యపై రెండు దేశాల తాజా నిర్ణయం

లఢక్ సరిహద్దుల్లో ఏం జరుగుతుందో అనే టెన్షన్ రెండు దేశాల ప్రజల్లోనూ ఉన్న సమయంలో... ఓ కీలక ప్రకటన కాస్త ఊరట ఇస్తోంది.

news18-telugu
Updated: June 3, 2020, 12:07 PM IST
భారత్ చైనా మధ్య ఉద్రిక్తతలకు చెక్?... సరిహద్దు సమస్యపై రెండు దేశాల తాజా నిర్ణయం
భారత్ చైనా మధ్య ఉద్రిక్తతలకు చెక్... సరిహద్దు సమస్యపై రెండు దేశాల తాజా నిర్ణయం (credit - twitter)
  • Share this:
ఇదివరకు డోక్లాం వివాదం విషయంలో భారత ప్రభుత్వమే ముందడుగు వేసింది. ఇప్పుడు మరోసారి లఢక్‌లో వాస్తవాధీన రేఖ వెంట సరిహద్దు ఉద్రిక్తతల విషయంలో కూడూ కేంద్ర ప్రభుత్వమే ఓ అడుగు ముందుకు వేసింది. జూన్ 6న సరిహద్దు ఉద్రిక్తలపై రెండు దేశాల మధ్య సీనియర్ కమాండర్ స్థాయిలో మిలిటరీ చర్చలు జరగనున్నాయి. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్... ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్నది వాస్తవమేనన్న మంత్రి... సరిహద్దు దగ్గర చైనా సైన్యం భారీగా మోహరించింది అన్నది నిజం అన్నారు. భారత భూభాగాన్ని తమ భూభాగం అని చైనా అంటోందన్న రాజ్‌నాత్ సింగ్... అది మన భూభాగం అని భారత్ చెబుతోందని తెలిపారు. ఈ విషయంపై రెండు దేశాలూ సమ్మతించటలేదని తెలిపారు.

రెండు దేశాలకూ చెందిన లెఫ్టినెంట్ జనరల్ స్థాయి సైనిక అధికారులు శనివారం చర్చల్లో పాల్గొంటారు. చల్లటి ప్రాంతంలో టీ తాగుతూ... ఎందుకీ ఉద్రిక్తతలు... ఆల్రెడీ కరోనాతో ఇబ్బంది పడుతున్నాం. మళ్లీ మధ్యలో ఈ బోర్డర్ గొడవలేంటి. దీని వల్ల మనకు ఏం ఉపయోగం. యుద్ధాలు చేసుకొని సాధించేదేముంది... అంటూ అధికారులు మాట్లాడుకుంటారని తెలుస్తోంది. మన దేశం తరపున 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ ఈ చర్చలో పాల్గొంటారు. మంగళవారం రెండు దేశాల మేజర్ జనరల్ స్థాయి అధికారులు... ఈ విషయంపై చర్చించారు. దాంతో... శనివారం మళ్లీ చర్చలు జరగనున్నాయి.

తూర్పు లఢక్‌లో నెల నుంచి భారత్, చైనా సైన్యం సరిహద్దులకు రెండు వైపులా మోహరించింది. మే 5న ఓసారి గొడవ జరిగి... 200 మంది సైనికులు రెండువైపులా గాయపడ్డారు. మే 9న మరోసారి జరిగిన గొడవలో ఓ పది మంది గాయపడ్డారు. ప్రస్తుతం రెండు దేశాలూ భారీగా ఆయుధాలు, సైన్యాన్ని మోహరించుకుంటున్నాయి.

చైనాతో భారత్‌కి సరిహద్దు సమస్య స్వాతంత్య్రం  వచ్చినప్పటి నుంచే ఉంది. అక్కడ సరిహద్దు సరిగా లేదు. దానిపై రెండు దేశాల మధ్యా ఏకాభిప్రాయం లేదు. ఏళ్లుగా సరిహద్దుపై రెండు దేశాల మధ్యా వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు... తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి పక్కన పెడదాం. అనుకుంటూ ముందుకు సాగుతున్నారు. చర్చల వల్ల ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశాలు తక్కువే అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే... ఎలాగైనా భారత భూభాగాన్ని లాక్కోవాలని కుట్రలు పన్నుతున్న చైనా... తన తీరు అస్సలు మార్చుకోవట్లేదు. అంతెందుకు తాజా వివాదంపై నెల నుంచి చర్చలు జరుగుతున్నా ఏమాత్రం చైనా మారట్లేదు. మరి శనివారం ఏమవుతుందో.
First published: June 3, 2020, 12:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading