పారామిలిటరీ క్యాంటీన్లలో 1000కి పైగా విదేశీ వస్తువులపై నిషేధం

ప్రతిదానికీ విదేశాలపై ఆధారపడటం మనకు అలవాటైపోయింది. మన మార్కెట్లలో అమ్మే వస్తువుల్లో కూడా విదేశాలవే ఎక్కువ ఉంటున్నాయి. ఇప్పడు కేంద్రం రూల్స్ మార్చేస్తోంది.

news18-telugu
Updated: June 1, 2020, 5:09 PM IST
పారామిలిటరీ క్యాంటీన్లలో 1000కి పైగా విదేశీ వస్తువులపై నిషేధం
పారామిలిటరీ క్యాంటీన్లలో 1000కి పైగా విదేశీ వస్తువులపై నిషేధం
  • Share this:
పారామిలిటరీ క్యాంటీన్లలో గ్రోసరీస్, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు... అన్నీ తక్కువ రేటుకి లభిస్తాయని మనకు తెలుసు. ఐతే... వాటిలో చాలా వరకూ విదేశాలవే ఉంటున్నాయి. మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని ప్రచారం చేస్తున్నప్పుడు... విదేశీ ఐటెమ్స్ ఎందుకు ఇంతలా ఉంటున్నాయి అన్న అంశం చర్చకు వచ్చిందేమో. కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. మైక్రోవేవ్ ఓవెన్స్ మొదలు పాదరక్షల వరకూ... 1000కి పైగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తులు ఇకపై కేంద్రీయ పోలీస్ కల్యామ్ భండార్ల (KPKB)లో లభించవు. ఈ సంస్థే... దేశవ్యాప్తంగా పారా మిలిటరీ క్యాంటీన్లను నిర్వహిస్తోంది. ఈ క్యాంటీన్లలో జూన్ 1 నుంచి స్వదేశీ ఉత్పత్తులే లభిస్తాయి.

ఇకపై KPKB క్యాంటీన్లలో మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులే అమ్మాలని కేంద్ర హోంశాఖ తాజాగా ఆదేశించింది. దీంతోపాటూ... విదేశాల నుుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువుల్ని కూడా నిషేధించింది. ఈ నేపథ్యంలో KPKB కూడా జాగ్రత్త పడింది. ఉత్పత్తి, తయారీకి సంబంధించి సరైన వివరాలు లేకపోతే... వాటిని క్యాంటీన్లలో అమ్మట్లేదు. ఈ క్యాంటీన్లలో CRPF, BSF, ITBP, CISF, SSB, NSG, అసోం రైఫిల్స్‌లో పనిచేసే 10 లక్షల మంది సరుకులు కొనుక్కుంటారు. 50 లక్షల మంది కుటుంబాల సభ్యులు వాటిని వాడుతారు.

ప్రస్తుతం సరిహద్దుల్లో చైనాతో పెద్ద వివాదమే నడుస్తోంది. రెండువైపులా సైన్యం... భారీగా మోహరిస్తోంది. ఆయుధాలు కూడా సరిహద్దులకు చేరవేస్తున్నారు. దేశంలో చైనా వ్యతిరేకత క్రమంగా పెరుగుతోంది. చైనా వస్తువుల్ని వాడకూడదనే ప్రచారం జోరుగా సాగుతోంది. చైనా యాప్స్ కూడా డిలీట్ చెయ్యాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. అందువల్లే కేంద్రం ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని తెలుస్తోంది.
First published: June 1, 2020, 2:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading