Russia S-400 missiles: చైనాకు భారీ షాక్ ఇచ్చిన రష్యా...మోదీ దెబ్బ మామూలుగా లేదుగా...

ఇప్పటికే భారత్, యుఎస్ఏ, ఆస్ట్రేలియాలతో వైరం కొనితెచ్చుకున్న చైనా తాజాగా రష్యాతో కూడా తన సంబంధాలను చెడగొట్టుకుంది. దాని పర్యవసానంగా, రష్యా ప్రస్తుతం ఎస్ -400 క్షిపణి రక్షణ వ్యవస్థలను (S-400 surface-to-air missile defense systems) చైనాకు ఇవ్వడాన్ని నిలిపివేసింది.

Krishna Adithya
Updated: July 27, 2020, 3:21 PM IST
Russia S-400 missiles: చైనాకు భారీ షాక్ ఇచ్చిన రష్యా...మోదీ దెబ్బ మామూలుగా లేదుగా...
మోదీతో జిన్‌పింగ్ (ఫైల్ ఫొటో)
  • Share this:
భారత్ ఇస్తున్న షాక్ లకు చైనా బెంబేలెత్తిపోతోంది. ముఖ్యంగా అంతర్జాతీయ సమాజం ముందు చైనాను ఏకాకిగా నిలపాలని భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. తాజాగా చైనాకు అతి సన్నిహిత మిత్రుడుగా ఉన్న రష్యా కూడా చైనాకు హ్యాండిచ్చేసింది. ఇప్పటికే భారత్, యుఎస్ఏ, ఆస్ట్రేలియాలతో వైరం కొనితెచ్చుకున్న చైనా తాజాగా రష్యాతో కూడా తన సంబంధాలను చెడగొట్టుకుంది. దాని పర్యవసానంగా, రష్యా ప్రస్తుతం ఎస్ -400 క్షిపణి రక్షణ వ్యవస్థలను (S-400 surface-to-air missile defense systems) చైనాకు ఇవ్వడాన్ని నిలిపివేసింది. చైనా విడుదల చేసిన ఒక ప్రకటనలో, మరో దేశం ఒత్తిడి వల్లనే రష్యా ఈ నిర్ణయం తీసుకుందని నిందలు వేసింది. ఈ క్షిపణి రక్షణ వ్యవస్థను రష్యా నుండి భారత్ కూడా కొనుగోలు చేయనుంది, దీంతో చైనా అప్రమత్తమై S-400 surface-to-air missile defense systems కొనుగోలు చేద్దామనుకుంది. అయితే రష్యా ప్రస్తుతం చైనాకు హ్యాండిచ్చింది. దీంతో చైనా కుతకుతలాడుతోంది. ఎస్ -400 ప్రపంచంలోని ఉత్తమ క్షిపణి రక్షణ వ్యవస్థగా పరిగణించబడుతోంది. రష్యాతో రక్షణ ఒప్పందం తరువాత, భారత్ ఈ సంవత్సరం S-400 surface-to-air missile defense systems మొదటి సిస్టంను పొందబోతోంది. ఇటీవల, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రష్యా పర్యటన సందర్భంగా, పుతిన్ ప్రభుత్వం దానిని సకాలంలో భారత్‌కు అందజేయడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఇది చైనాకు కూడా పెద్ద షాక్, ఎందుకంటే ఒకవైపు రష్యా భారతదేశానికి సకాలంలో బట్వాడా చేస్తామని హామీ ఇచ్చింది, అయితే చైనా తన డెలివరీని ఆపలేదు, కానీ ఈ క్షిపణి రక్షణ వ్యవస్థను ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పలేదు.

రష్యా ఒత్తిడిలో పనిచేస్తోంది

వార్తా సంస్థ ఎఎఫ్‌పి ప్రకారం, "ఈసారి చైనాకు ఎస్ -400 క్షిపణి పంపిణీని ఆపివేస్తున్నట్లు రష్యా స్పష్టం చేసింది." చైనాలో ఒక మీడియా నివేదిక ఇలా చెప్పింది - 'రష్యా ఒత్తిడితోనే ఎస్ -400 పంపిణీని నిలిపివేసిందని చైనా అభిప్రాయపడింది. కాగా ఇప్పటికే క్షిపణి వ్యవస్థ శిక్షణ ఇవ్వడానికి చైనా తన దళాలను రష్యాకు కూడా పంపింది. కానీ క్షిపణి వ్యవస్థ రద్దు కావడం వెనుక రష్యా ఒత్తిడితో నిర్ణయం తీసుకుందని చైనా స్పష్టంగా నమ్ముతోంది. ఒక చైనా అధికారి మాట్లాడుతూ - కరోనావ్యాధి సమయంలో చైనాకు ఎస్ -400 పంపిణీ చేస్తే, అది సమస్యలను పెంచుతోందని రష్యా భావిస్తున్నట్లు అభిప్రాయపడింది.

చైనాకు కొన్ని యూనిట్లు ఉన్నాయి
భారత్, చైనా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత నేపథ్యంలో రష్యా ఈ నిర్ణయం తీసుకుందని నిపుణులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే S-400 surface-to-air missile defense systems క్షిపణి వ్యవస్థ యొక్క మొదటి డెలివరీని 2018 లో చైనా అందుకుంది. కాగా ఈ డిసెంబర్ నాటికి భారత్ కూడా తొలి డెలివరీ అందుకోనుంది. భారత్ బలహీనంగా కనిపించకుండా చూసుకోవడానికి, మొదట ఈ వ్యవస్థను భారతదేశానికి ఇవ్వాలని రష్యా నిర్ణయించుకుంది. ఇది కాకుండా, రష్యా ఇటీవల తన సెయింట్ పీటర్స్బర్గ్ ఆర్కిటిక్ సోషల్ సైన్స్ అకాడమీ అధ్యక్షుడు వాలెరీ మిట్కోను అరెస్ట్ చేసింది. చైనాకు చాలా సున్నితమైన సైనిక సమాచారం ఇచ్చి, ప్రతిఫలంగా డబ్బు తీసుకున్నట్లు రష్యా నిఘా వ్యవస్థ ఆరోపిస్తోంది. వాలెరీ తన సహచరులలో మరో ముగ్గురిని కూడా అరెస్టు చేశారు. వారిలో ఇద్దరు చైనా పౌరులు ఉన్నారు. ఈ ఎపిసోడ్ తర్వాత రష్యా , చైనా మధ్య అంతరాలు పెరిగాయి.

ఎస్ -400 క్షిపణి రక్షణ వ్యవస్థ అంటే ఏమిటో తెలుసుకోండి
ఎస్ -400 క్షిపణి వ్యవస్థ 400 కిలోమీటర్ల వ్యాసార్థంలో పడే క్షిపణులను 5th Generation యుద్ధ విమానాలను కూడా నాశనం చేయగలదు. ఎస్ -400 రక్షణ వ్యవస్థ ఒక రకమైన క్షిపణి కవచంగా పనిచేస్తుంది. పాకిస్తాన్ లేదా చైనా అణుశక్తితో పనిచేసే బాలిస్టిక్ క్షిపణులను ఒక వేళ భారత్ పై పడకుండా కాపాడుతుంది. సమాచారం ప్రకారం, ఈ వ్యవస్థ ఒకేసారి 72 క్షిపణులను నిరోధించగలదు. అలాగే, ఈ వ్యవస్థ అమెరికా అత్యంత అధునాతన ఫైటర్ జెట్ ఎఫ్ -35 ను కూడా నిలువరించగలదు. అదనంగా, ఈ వ్యవస్థ అణు సామర్థ్యంతో కూడిన 36 క్షిపణులను ఏకకాలంలో నాశనం చేస్తుంది. చైనా తరువాత, ఈ రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసిన రెండో దేశం భారత్ కావడం విశేషం.
Published by: Krishna Adithya
First published: July 27, 2020, 3:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading