గల్వాన్ ఘర్షణలో చైనా జవాన్ల మృతిపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..

జూన్ 15, 16 తేదీల్లో లద్దాఖ్‌కు తూర్పున ఉన్న గల్వాన్ లోయలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ నెలకొంది. 1972 తర్వాత ఈ స్థాయి ఘర్షణ జరగడం ఇదే తొలిసారి

news18-telugu
Updated: July 2, 2020, 3:50 PM IST
గల్వాన్ ఘర్షణలో చైనా జవాన్ల మృతిపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
గల్వాన్ లోయ ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మరణిచిన విషయం తెలిసిందే. ఐతే చైనా వైపు ఎంత మంది చనిపోయారన్న దానిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. 43 మంది వరకు మరణించారని అంతర్జాతీయ కథనాలు పేర్కొంటున్నాయి. కానీ చైనా మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఐతే చైనా సైనికుల మృతిపై కేంద్రం మంత్రి రవిశంకర్ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. గల్వాన్ ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు అమరులయ్యారని.. చైనా వైపు రెట్టింపు సంఖ్యలో జవాన్లు చనిపోయారని చెప్పారు. భారత్ శాంతి కోరుకుంటోందని.. ఎవరైనా దుష్ట చూపుతో చూస్తే మాత్రం గట్టిగా సమాధానం చెబుతుందని అన్నారు.

ప్రస్తుతం అందరూ రెండు 'c' ల గురించే వింటున్నారు. ఒకటి Coronavirus. రెండు China. మేం శాంతిని కోరుకుంటున్నాం. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని చెబుతున్నాం. కానీ భారత్‌పై ఎవరైనా దుష్ట చూపు చూస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ధీటుగా సమాధానం చెబుతాం. గల్వాన్ ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. అదే చైనా వైపు రెట్టింపు సంఖ్యలో సైనికులు మరణించారు.
రవిశంకర్ ప్రసాద్, కేంద్ర మంత్రి


Ayodhya Case Should Be Heard Without Delay, Says Ravi Shankar Prasad
రవిశంకర్ ప్రసాద్(File)

జూన్ 15, 16 తేదీల్లో లద్దాఖ్‌కు తూర్పున ఉన్న గల్వాన్ లోయలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ నెలకొంది. 1972 తర్వాత ఈ స్థాయి ఘర్షణ జరగడం ఇదే తొలిసారి. ఆ ఘటనలో 20 మంది సైనికులు అమరులయ్యారు. వారిలో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ కూడా ఉన్నారు. అటు చైనా వైపు 43 మంది మరణించినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు కథనాలు ప్రసారం చేశాయి. కానీ చైనా మాత్రం ఇప్పటి వరకు నోరు విప్పలేదు.
First published: July 2, 2020, 4:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading