Home /News /india-china /

IAF REACTIVATED WORLDS HIGHEST AIRSTRIP AT DAULAT BEG OLDIE NEAR LAC IN 2008 WITHOUT CENTRES PERMISSION NK

ప్రపంచంలో ఎత్తైన ఎయిర్‌స్ట్రిప్‌ని మళ్లీ వాడుతున్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్... చైనా వల్లేనా?

ప్రపంచంలో ఎత్తైన ఎయిర్‌స్ట్రిప్‌ని మళ్లీ వాడుతున్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్... చైనా వల్లేనా? (File)

ప్రపంచంలో ఎత్తైన ఎయిర్‌స్ట్రిప్‌ని మళ్లీ వాడుతున్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్... చైనా వల్లేనా? (File)

చైనాతో లడక్ సరిహద్దు వివాదం కొనసాగుతున్న సమయంలో... ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ జాగ్రత్త పడుతోంది. యుద్ధం జరగకపోయినా అందుకు సిద్ధంగా ఉంటోంది.

    ది దౌలత్ బేగ్ ఓల్డీ (DBO)... ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న ఎయిర్‌స్ట్రిప్. తూర్పు లడక్‌లో ఉంది. 2008 మే నెలలో... ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దీన్ని తిరిగి యాక్టివేట్ చేసింది. కానీ వాడట్లేదు. ఇప్పుడు చైనాతో లడక్ సరిహద్దు వివాదం కొనసాగుతున్న తరుణంలో... DBOని తిరిగి వాడుతోంది. ఇది సముద్ర మట్టానికి 16800 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇంత ఎత్తులో విమానాలు ల్యాండింగ్ అవ్వడం ఓ సవాలే. అంత ఎత్తులో ఎయిర్‌స్ట్రిప్ నిర్మాణమే కష్టమైన పని. ఇప్పుడు ఇక్కడ AN-32, C-130J సూపర్ హెర్క్యులస్ వంటి యుద్ధ విమానాల్ని ల్యాండ్ చేస్తన్నారు.

    సరిహద్దుల్లో అదీ లడక్‌లో ఉన్న ఎయిర్‌స్ట్రిప్‌ని తిరిగి వాడే విషయాన్ని అప్పట్లో యూపీఏ ప్రభుత్వానికి చెప్పకుండా ఎలా ఎయిర్‌ఫోర్స్ నిర్ణయం తీసుకుందనే విషయం ఇప్పుడు చర్చకు ఉంది. దీనిపై అప్పట్లో కేంద్రం ఎలాంటి అభ్యంతరాలూ చెప్పలేదు గానీ... అప్పటి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ... తిరిగి ఎందుకు యాక్టివేట్ చేశారని మాత్రం ప్రశ్నించారు. సైనిక అవసరాల రీత్యా నిర్ణయం తీసుకున్నామని రిటైర్డ్ వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ అప్పట్లో తెలిపారు. ఈ విషయంపై చైనా-భారత్ మధ్య అప్పట్లో జరిగిన చర్చల్లో చైనా ప్రస్తావనకు తెస్తుందేమో అని యూపీఏ ప్రభుత్వం అనుకుంది. కానీ ఈ అంశం చర్చకు రాలేదు.

    1965లో ఈ ఎయిర్‌స్ట్రిప్‌ను తిరిగి యాక్టివేట్ చెయ్యాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు అప్పటి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఎన్నోసార్లు ఈ ప్రతిపాదనను తిరస్కరించాయి ప్రభుత్వాలు. మొత్తానికి ఇప్పుడు ఈ ఎయిర్‌స్ట్రిప్ ఇండియాకి అదనపు బలం కాబోతోంది. చైనా గనక యుద్ధ సన్నాహాలు చేస్తే... ఇండియా DBO సేవల్ని ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయి.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: India-China

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు