హైదరాబాద్‌లో హోల్ సేల్ వ్యాపారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. చైనా వస్తువులను బహిష్కరించాలని నిర్ణయించారు. ఇకపై చైనా మాల్ విక్రయించకూడదని నిర్ణయించారు. హైదరాబాద్‌లోని బేగం బజార్, సిద్ధి అంబర్ బజార్, ఫీల్ ఖానాల్లో హోల్ సేల్ వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతుంది. భాగ్యనగరంలోని రిటైల్ వ్యాపారులు వారి వద్దే కొనుక్కుని తమ తమ ప్రాంతాల్లో విక్రయిస్తూ ఉంటారు. ప్రస్తుతం దేశంలో చైనా వస్తువుల వ్యతిరేక, బహిష్కరణ ఉద్యమం ఊపందుకుంటోంది. లద్దాక్‌లోని గాల్వన్ లోయలో చైనా బలగాలతో ఘర్షణలో 20 మంది భారత సైనికులు చనిపోయిన తర్వాత చైనా వస్తువులను బహిష్కరించాలంటూ ఉద్యమం నడుస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో హోల్ సేల్ వ్యాపారులు సమావేశం నిర్వహించారు. చైనా మాల్ గురించి వివరాలు చర్చించారు. ఇకపై వాటిని బహిష్కరించాలని నిర్ణయించారు. అలాగే, హైదరాబాద్‌లో రోజు రోజుకూ కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకే వ్యాపార కార్యకలాపాలు నిర్వహించాలని నిర్ణయించారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.