లద్దాఖ్‌లో అసలేం జరుగుతోంది.. కేంద్రాన్ని నిలదీసిన రాహుల్

రాహుల్ గాంధీ

చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తలపై కేంద్రం స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై భారత ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో ఉండాలని స్పష్టం చేశారు.

 • Share this:
  భారత్, చైనా మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఇరుదేశ సైన్యాల మధ్య సరిహద్దు వివాదం రాజుకుంది. వాస్తవాధీన రేఖ వెంబడి లద్దాఖ్‌తో పాటు పలు చోట్ల పోటాపోటీగా బలగాలని మోహరించాయి. ఈ నేపథ్యంలో చైనా, ఇండియా సరిహద్దుల్లో అసలేం జరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై స్పందించిన రాహుల్ గాంధీ.. కేంద్రంపై పలు ప్రశ్నలు గుప్పించారు. చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తలపై కేంద్రం స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై భారత ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో ఉండాలని స్పష్టం చేశారు. మంగళవారం వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చైనా, నేపాల్‌తో జరుగుతున్న గొడవలపై స్పష్టత నివ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

  చైనా, ఇండియా వివాదానికి సంబంధించి విభిన్న స్టోరీలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాలను తెలియకుండా నేను కామెంట్ చేయను. కానీ ఇరుదేశాల సరిహద్దుల్లో అసలేం జరుగుతుందో దేశ ప్రజలకు కేంద్రం చెప్పాలి. నేపాల్, చైనాతో నెలకొన్న వివాదాలకు సంబంధించి ప్రభుత్వం పారదర్శకతతో ఉండాలి. నాకు ఎక్కడా పారదర్శకత కనిపించడం లేదు.
  రాహుల్ గాంధీ


  మే 5న తూర్పు లద్దాఖ్‌లో భారత్, చైనాకి చెందిన 250 మంది సైనికులు కొట్టుకున్నారు. పరస్పరం రాళ్లు విసురుకున్నారు. ఈ గొడవలో రెండువైపులా 100 సైనికులు గాయపడ్డారు. ఆ తర్వాతి రోజు రెండు వైపులా కమాండర్లు మాట్లాడుకోవడం ద్వారా మేటర్ సెటిలైంది. 4 రోజుల తర్వాత ఉత్తర సిక్కింలో నాథులా పాస్ వద్ద మరోసారి గొడవ జరిగింది. ఆ ఘటనలో రెండువైపులా 10 మంది సైనికులు గాయపడ్డారు. తాజాగా చైనా తూర్పు లఢక్ దగ్గర వాస్తవాధీన రేఖ వెంట 5000 బలగాల్ని వేర్వేరు లొకేషన్లలో మోహరించింది. పాంగ్యాంగ్ సరస్సు, గల్వాన్ లోయ సమీపంలో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టింది. ఇది గమనించిన ఇండియా కూడా భారీగా మోహరించింది. ఇలా పోటా పోటీగా సైన్యాలను మోహరించడంతో సరిహద్దులలో అసలేం జరుగుతోందనని అంతటా ఉత్కంఠ నెలకొంది.
  Published by:Shiva Kumar Addula
  First published: