China Apps Banned: మరో 47 చైనా యాప్స్ బ్యాన్... లిస్ట్‌లో ఉన్న యాప్స్ ఇవే

China Apps Ban | భారత ప్రభుత్వం మరిన్ని చైనా యాప్స్‌ని బ్యాన్ చేయనుందన్న వార్తలొస్తున్నాయి. ఈసారి కూడా పాపులర్ యాప్స్‌పై నిషేధం విధించే అవకాశముంది.

news18-telugu
Updated: July 27, 2020, 2:44 PM IST
China Apps Banned: మరో 47 చైనా యాప్స్ బ్యాన్... లిస్ట్‌లో ఉన్న యాప్స్ ఇవే
China Apps: మరో 47 చైనా యాప్స్ బ్యాన్? లిస్ట్‌లో పబ్‌జీ, లూడో వాల్డ్... (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఇప్పటికే 59 చైనా యాప్స్‌ని బ్యాన్ చేసిన భారత ప్రభుత్వం మరో 47 యాప్స్‌ని నిషేధించింది. భారతదేశం, చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో భారత ప్రభుత్వం మరిన్ని యాప్స్‌ని బ్యాన్ చేసే దిశగా ఆలోచిస్తోంది. జాతీయ భద్రతకు, ప్రైవసీకి ముప్పుగా ఉన్న మరో 275 యాప్స్‌ని పరిశీలించిన ప్రభుత్వం... వీటిలో 47 యాప్స్‌ని బ్యాన్ చేసింది. ఇప్పటికే ఇండియాలో బాగా పాపులర్ అయిన టిక్‌టాక్, హెలో లాంటి 59 యాప్స్‌ని భారత ప్రభుత్వం బ్యాన్ చేయడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో 47 యాప్స్‌ని నిషేధించింది. అందులో టిక్‌టాక్ లైట్, హెలో లైట్, బిగో లైవ్ లైట్ లాంటి యాప్స్ ఉన్నాయి.



Airtel: ఎయిర్‌టెల్ నుంచి ఆ ప్లాన్ ఔట్... యూజర్లకు కొత్త ఆఫర్

Realme 6i: రియల్‌మీ 6ఐ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... ధర ఎంతో తెలుసా?భారత ప్రభుత్వం నిషేధం విధించిన 47 యాప్స్‌ జాబితా రాలేదు. ఇందులో పాపులర్ గేమింగ్ యాప్స్ అయిన పబ్‌జీ మొబైల్, లూడో వాల్డ్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అలీ ఎక్స్‌ప్రెస్ లాంటివి ఉంటాయని తెలుస్తోంది. పబ్‌జీ చైనాకు చెందిన టెక్ దిగ్గజం టెన్సెంట్ కంపెనీది కాగా, అలీ ఎక్స్‌ప్రెస్ అలీబాబాది. వీటితో పాటు షావోమీకి చెందిన జిలీ, బైట్‌డ్యాన్స్‌కు చెందిన మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ రెస్సో లంటివి ఉండొచ్చని సమాచారం. మరిన్ని యాప్స్ నిషేధంపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అధికారిక ప్రకటన వస్తే ఆ 47 యాప్స్ ఏవి అన్న స్పష్టత వస్తుంది.

WhatsApp: మీ ఫోన్‌లో వాట్సప్ ఉందా? అయితే అప్పు తీసుకోవచ్చు

WhatsApp: అలర్ట్... ఇలా చేస్తే మీ వాట్సప్ బ్లాక్ అవుతుంది జాగ్రత్త

గాల్వాన్ లోయలో చైనా సైన్యం జరిపిన దాడిలో 20 మంది భారత సైనికులు అమరవీరులైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత యాంటీ చైనా సెంటిమెంట్ భారతదేశంలో పెరిగింది. చైనా వస్తువులు, యాప్స్, స్మార్ట్‌ఫోన్లు నిషేధించాలన్న డిమాండ్లు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం చైనా మూలాలున్న 59 యాప్స్‌ని నిషేధించింది.
Published by: Santhosh Kumar S
First published: July 27, 2020, 2:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading