ఆయన నరేంద్రమోదీ కాదు... సరెండర్ మోదీ... ప్రధానిపై రాహుల్ గాంధీ ఎటాక్....

రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ

చైనా దూకుడు అంశాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయ అజెండాగా మలచుకుంటోందా? కరోనా తర్వాత రాహుల్ మరోసారి ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

 • Share this:
  భారత్-చైనా సరిహద్దుల్లో గత సోమవారం రాత్రి రెండు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ అంశంపై పదే పదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విరుచుకుపడుతోంది. అసలు ఘర్షణ జరిగినప్పుడు భారత సైనికుల దగ్గర ఆయుధాలు ఎందుకు లేవు అంటూ ప్రశ్నించిన... కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ... ప్రధాని... నరేంద్రమోదీ కాదనీ... సరెండర్ మోదీ అని విమర్శించారు. ఇటీవల చైనా బలగాలు... భారత భూభాగంలోకి రాలేదని ప్రధాని మోదీ దేశ ప్రజలకు తెలిపారు. దీనిపై అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ లోతుగా ప్రశ్నించింది. చైనా సైనికులు భారత భూభాగంలోకి రాకపోతే... అసలు ఘర్షణ ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. ఈ ఘర్షణ భారత-చైనా సరిహద్దులోని గాల్వాన్ లోయ దగ్గర జరిగినట్లు తెలియడంతో... దీనిపై క్లారిటీ ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.


  ఘర్షణ జరిగింది చైనా భూభాగంలో అయితే... భారత సైనికులు ఆ భూభాగంలోకి వెళ్లలేదు కాబట్టి... సైనికులు ఎలా చనిపోయారని రాహుల్ ప్రశ్నిస్తున్నారు. చైనా సైనికులు భారత భూభాగంలోకి వచ్చి ఎలా చంపారని అడుగుతున్నారు. తాజాగా గాల్వాన్ లోయ తమదేనని చైనా ప్రచారం చేస్తుండటం కూడా రాహుల్ విమర్శలు చేయడానికి కారణమైందంటున్నారు విశ్లేషకులు.

  రాహుల్ ప్రశ్నకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓ సమాధానం ఇచ్చారు. ఇలాంటి అంశాలపై రాజకీయాలు మాని... సైనికులకు మద్దతుగా, దేశ ఐక్యతను కాపాడాలని కోరారు. ఓ జవాన్ తండ్రి వీడియోని ఆయన ప్రస్తుతించారు. అందులో జవాన్ తండ్రి రాహుల్‌ను... చైనాతో జట్టు కట్టవద్దని కోరారు.


  రాహుల్ ట్వీట్‌పై బీజేపీ ఎంపీ మీనాక్షీ లేఖీ మండిపడ్డారు. ట్విట్టర్ చాలా చైనా మద్దతుదారుల ప్రచారాన్ని బ్యాన్ చేసిందనీ... అతి పెద్ద చైనా మద్దతు ప్రచారాన్ని మాత్రం మిస్సైందని రాహుల్‌పై పరోక్షంగా సెటైర్ వేశారు.


  ఇలా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్న సమయంలో... ఈ అంశం రాజకీయంగా దుమారం రేపుతూ ఉంది. ఇదివరకు కరోనా వచ్చిన కొత్తలో కూడా రాహుల్ ఇలాగే మోదీపై విరుచుకుపడ్డారు. ఇప్పుడు మరోసారి వరుస ట్వీట్లతో విమర్శిస్తున్నారు.
  Published by:Krishna Kumar N
  First published: