India-china: ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 76 మంది భారత జవాన్లు

చికిత్స పొందుతున్న వారిలో ఎవరి పరిస్థితీ విషమంగా లేదని చెప్పారు. అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని స్పష్టం చేశారు.

news18-telugu
Updated: June 18, 2020, 10:50 PM IST
India-china: ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 76 మంది భారత జవాన్లు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
గాల్వన్ లోయ ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులవగా.. మరికొందరికి గాయాలయ్యాయి. ఐతే గాయపడిన జవాన్ల గురించి ఇండియన్ ఆర్మీ వర్గాలు కీలక వివరాలు వెల్లడించాయి. ప్రస్తుతం 76 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపినట్లు ANI వార్తా సంస్థ పేర్కొంది. 18 మంది జవాన్లు లేహ్‌లోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.. వీరంతా కోలుకొని మరో వారం రోజుల్లో తిరిగి విధులుకు హాజరవుతారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. మరో 58 మందికి వివిధ ఆస్పత్రుల్లో ట్రీట్‌మెంట్ ఇస్తున్నామని.. వీరు సైతం మరో 15 రోజుల్లో కోలుకొని తిరిగి విధులకు వెళ్తారని పేర్కొన్నారు. చికిత్స పొందుతున్న వారిలో ఎవరి పరిస్థితీ విషమంగా లేదని చెప్పారు. అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని స్పష్టం చేశారు.

కాగా, లద్దాఖ్ సమీపంలోని గల్వాన్ లోయలో ఈ నెల 15, 16వ తేదీల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇరువర్గాలు కర్రలు, రాళ్లతో కొట్టుకున్నారు. ఈ ఘటనలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. అటు చైనా ఆర్మీకి కూడా భారీగా ప్రాణ నష్టం సంభవించిందని.. సుమారు 43 మంది చైనా సైనికులు మరణించారని అంతర్జాతీయ కథనాలు పేర్కొంటున్నాయి. ఐతే కల్నల్ స్థాయి అధికారి సహా 20 మంది సైనికులు చనిపోవడాన్ని భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది. చైనా సంస్థలతో ఒప్పందాలు రద్దు చేసుకొని.. చైనా ఉత్పత్తులను బహిష్కరించి.. డ్రాగన్‌ను ఆర్థికంగా దెబ్బతీయాలని యోచిస్తోంది.
First published: June 18, 2020, 10:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading