సరిహద్దు టెన్షన్‌పై చైనా దౌత్యాధికారి ప్రకటన...

వాస్తవాధీన రేఖ వద్ద భారత్, చైనాల మధ్య నెలకొన్న సరిహద్దు టెన్షన్‌పై ఇండియాలో చైనా దౌత్యాధికారి సన్ వీడాంగ్ స్పందించారు.

news18-telugu
Updated: May 27, 2020, 10:30 PM IST
సరిహద్దు టెన్షన్‌పై చైనా దౌత్యాధికారి ప్రకటన...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
వాస్తవాధీన రేఖ వద్ద భారత్, చైనాల మధ్య నెలకొన్న సరిహద్దు టెన్షన్‌పై ఇండియాలో చైనా దౌత్యాధికారి సన్ వీడాంగ్ స్పందించారు. ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘డ్రాగన్, ఏనుగు కలసి డ్యాన్స్ చేయడం అనేదే చైనా, భారత్‌ల సరైన ఎంపిక’ అని అన్నారు. రెండు దేశాలు, ప్రజల ప్రాథమిక ఆకాంక్షలను ఇది నెరవేరుస్తుందన్నారు. ‘చైనా, భారత్ పరస్పరం అవకాశాలను ఇచ్చిపుచ్చుకునేవి. ఒకరికొకరు ఎలాంటి భయం లేనివి. రెండు దేశాలు ఎదుటి దేశం అభివృద్ధిని సరైన దృష్టిలో చూడాలి. పరస్పరం నమ్మకం కలిగి ఉండాలి. మన మధ్య బేధాలను మనం సరైన కోణంలో చూడాలి. అలాగే, ఆ బేధాలు పరస్పర ద్వైపాక్షి సహకారాన్ని నీడలా కమ్మేయకూడదు.’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అదే సమయంలో బుధవారం మధ్యాహ్నం చైనా విదేశాంగ శాఖ మంత్రి మాట్లాడుతూ రెండు దేశాల మధ్య సరిహద్దు అంశం కంట్రోల్‌లోనే ఉందని చెప్పారు. మరోవైపు చైనా - భారత్ సరిహద్దు వివాదంపై తనను కోరితే మధ్యవర్తిత్వం జరిపేందుకు సిద్ధంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
First published: May 27, 2020, 10:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading