China Apps Ban: చైనా యాప్స్‌ని బ్యాన్ చేయడం మీరు సమర్థిస్తారా? మీ అభిప్రాయం ఇక్కడ చెప్పండి

China Apps Ban | రెండు రోజుల క్రితం ప్రభుత్వం 59 చైనా యాప్స్‌ని నిషేధించింది. మరి మీరు చైనా యాప్స్‌ని నిషేధించడాన్ని సమర్థిస్తారా? మీ అభిప్రాయం ఈ పోల్‌లో చెప్పండి.

news18-telugu
Updated: July 1, 2020, 1:14 PM IST
China Apps Ban: చైనా యాప్స్‌ని బ్యాన్ చేయడం మీరు సమర్థిస్తారా? మీ అభిప్రాయం ఇక్కడ చెప్పండి
China Apps Ban: చైనా యాప్స్‌ని బ్యాన్ చేయడం మీరు సమర్థిస్తారా? (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
భారత ప్రభుత్వం 59 చైనా యాప్స్‌ని బ్యాన్ చేయడం సంచలనం సృష్టించింది. ఒకేసారి 59 యాప్స్‌ని నిషేధించడం అతిపెద్ద సంచలనంగా మారింది. అంతకుముందు నుంచే చైనా యాప్స్‌ని స్మార్ట్‌ఫోన్ల నుంచి అన్-ఇన్‌స్టాల్ చేయాలన్న వాదన తీవ్రంగా ఉంది. చైనీస్ యాప్స్‌ని బ్యాన్ చేయాలని అనేక మంది డిమాండ్ చేశారు. అంతే కాదు... చైనా వస్తువుల్ని నిషేధించాలన్న డిమాండ్ కూడా ఉంది. ఇలా చైనాపై ఆగ్రహానికి కారణం ఇటీవల లడఖ్‌లోని గాల్వాన్ లోయలో చైనా సైన్యం భారత సైనికులపై దాడి చేయడమే. ఈ ఘటనలో 20 మంది భారత సైనికులు అమరవీరులయ్యారు. దీంతో ఇండియా-చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. యాంటీ చైనా అభిప్రాయం దేశమంతా పెరుగుతోంది. ఆ తర్వాత చైనా వస్తువులు, యాప్స్, స్మార్ట్‌ఫోన్లు నిషేధించాలన్న డిమాండ్లు పెరిగాయి. రెండు రోజుల క్రితం ప్రభుత్వం 59 చైనా యాప్స్‌ని నిషేధించింది. మరి మీరు చైనా యాప్స్‌ని నిషేధించడాన్ని సమర్థిస్తారా? మీ అభిప్రాయం ఈ పోల్‌లో చెప్పండి.

First published: July 1, 2020, 1:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading