Home /News /india-china /

DEPARTMENT OF TELECOM HAS FIRMLY DECIDED TO TELL BSNL NOT TO USE CHINESE EQUIPMENTS IN THE UPGRADATION OF ITS 4G FACULTIES MK

India-China: BSNL కీలక నిర్ణయం...చైనీస్ పరికరాల కొనుగోలు నిలిపివేత..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ఇండో చైనా ఉద్రిక్తత నేపథ్యంలో, 4 జి అప్‌గ్రేడ్ సదుపాయంలో చైనా పరికరాలను ఉపయోగించవద్దని ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్‌ఎన్‌ఎల్) ను కేంద్ర టెలికాం విభాగం కోరింది.

    ఇండో చైనా ఉద్రిక్తత నేపథ్యంలో, 4 జి అప్‌గ్రేడ్ సదుపాయంలో చైనా పరికరాలను ఉపయోగించవద్దని ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్‌ఎన్‌ఎల్) ను కేంద్ర టెలికాం విభాగం కోరింది. 4 జి వ్యవస్థకు అప్‌గ్రేడ్ చేయడం బిఎస్‌ఎన్‌ఎల్ పునరావాస ప్యాకేజీలో భాగంగా నిర్వహిస్తున్నారు. ఈ విషయంలో టెండర్‌లను నిలిపివేయాలని కేంద్ర టెలికాం విభాగం బిఎస్‌ఎన్‌ఎల్‌ను కోరింది. దేశంలోని ప్రైవేట్ మొబైల్ సర్వీస్ ఆపరేటర్లు కూడా చైనా కంపెనీల ఉత్పత్తులపై ఆధారపడటాన్ని తగ్గించాలని టెలికాం విభాగం సూచించింది. చైనా సంస్థలు తయారుచేసిన నెట్‌వర్క్ పరికరాలకు సంబంధించి భద్రతా ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: India-China

    తదుపరి వార్తలు