ఇటువైపు పాకిస్తాన్ ఉగ్రవాదులను ఎగదోస్తోంది. అటువైపు చైనా సరిహద్దు కయ్యానికి కాలుదువుతోంది. ఈ నేపథ్యంలో మన దేశ రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు కేంద్రం వ్యూహాలు రచిస్తోంది. రక్షణశాఖ అమ్ముల పొదిలోకి మరిన్ని అధునాతన అస్త్రాలను చేర్చేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఇప్పటికే జూలై నెలాఖరుకు తొలి విడతగా 6 రఫేల్ యుద్ధ విమానాలు చేరుకోనుండగా..తాజా మరో కీలక ఒప్పందం చేసుకుంది. రష్యా నుంచి 33 కొత్త యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనలకు రక్షణశాఖ ఆమోద ముద్రవేసింది. రూ. 18,148 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టున్నారు.
రష్యా నుంచి 12 Su-30MKI (సుఖోయ్) యుద్ధ విమానాలతో పాటు మరో 21 MiG-29 (మిగ్) యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. అంతేకాదు ప్రస్తుతం మన వద్ద ఉన్న 59 మిగ్-29 విమానాలను ఆధునీకరించనుంది.
Defence Ministry approves proposal to acquire 33 new fighter aircraft from Russia including 12 Su-30MKIs and 21 MiG-29s along with upgradation of 59 existing MiG-29s. The total cost of these projects would be Rs 18,148 crores: Defence Ministry pic.twitter.com/nMvZvBn37Y
అంతేకాదు భారత వాయుసేన, నౌకాదళానికి అదనంగా 248 అస్త్ర ఎయిర్ టూ ఎయిర్ మిసైల్స్‌ను సమకూర్చనుంది. వెయ్యి కి.మీ. దూరంలోని లక్ష్యాలను సైతం ఛేదించగల లాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్స్ తయారీకి రక్షణశాఖ ఆమోద ముద్రవేసింది. ఈ క్షిపణులను డీఆర్డీవో తయారుచేయనుంది. ఇవి త్రివిద దళాలకు చేరితే భారత రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం కానుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.