రక్షణరంగంలో ఆత్మనిర్భర భారత్... రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన ప్రకటన

Atmanirbhar Bharat : చైనాతో వరుసగా ఘర్షణ వాతావరణం, సమస్యలు తలెత్తుతున్న సమయంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్... సంచలన ప్రకటన చేశారు.

news18-telugu
Updated: August 9, 2020, 10:17 AM IST
రక్షణరంగంలో ఆత్మనిర్భర భారత్... రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన ప్రకటన
రక్షణరంగంలో ఆత్మనిర్భర భారత్... రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన ప్రకటన
  • Share this:
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుతో... కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ కూడా... ఆత్మనిర్భర భారత్ దిశగా అడుగులు వేయబోతున్నట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రత్యేకంగా ప్రకటించారు. ఆత్మనిర్భర భారత్ దిశగా రక్షణ రంగం అత్యంత భారీ నిర్ణయాలు తీసుకోబోతోందన్న ఆయన... రక్షణ రంగ పరికరాల్ని దేశీయంగానే ఉత్పత్తి చేసే దిశగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ప్రధాని తాజాగా ఇచ్చిన పిలుపైన ఐదు మూల స్తంభాలైన ఆర్థిక రంగం, మౌలిక వసతులు, వ్యవస్థ, ప్రజాస్వామ్యం, డిమాండ్‌కి తగినట్లుగా రక్షణ రంగం కూడా అడుగులు వేయనున్నట్లు రాజ్‌నాథ్ వివరించారు. రక్షణ రంగంలో మొత్తం 101 రకాల ఆయుధాలు, వస్తువుల జాబితా తయారుచేశామన్న రాజ్‌నాథ్... వాటి దిగుమతులను రద్దు చేస్తామన్నారు. తద్వారా వాటిని భారత్‌లోనే తయారుచేయిస్తామన్నారు. ఇది ఆత్మనిర్భర భారత్‍‌లో ఓ భారీ అడుగు అన్నారు.త్రివిధ దళాల్లో 260 రకాల అంశాలకు సంబంధించి... 2015 ఏప్రిల్ నుంచి 2020 ఆగస్ట్ వరకూ... రూ.3.5 లక్షల కోట్ల కాంట్రాక్టులు కుదిరాయన్న రాజ్‌నాథ్ సింగ్... వచ్చే ఆరేడు సంవత్సరాల్లో దేశీయంగా... దాదాపు రూ.4లక్షల కోటల కాంట్రాక్టులు కుదురుతాయన్నారు. వాటిలో రూ.130000 కోట్ల కాంట్రాక్టులు ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌కి చెందుతాయనీ... మిగతా... రూ.140000 కోట్లు నౌకా దళానికి సంబంధించినవని తెలిపారు.భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్... కీలక ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చైనాతో ఘర్షణ వాతావరణం దృష్ట్యా... ఫ్రాన్స్ నుంచి ఐదు రాఫెల్ యుద్ధ విమానాల్ని కేంద్రం వేగంగా ఇండియాకి తెప్పించి, వాటిని లఢక్ ప్రాంతంలో... మోహరించిన తరుణంలో... రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ కీలక ప్రకటన చేశారు. దేశీయంగానే ఆయుధ ఉత్పత్తుల్ని తయారుచేయడం ద్వారా... దేశంలో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి అలాగే... ఆయుధ సంపత్తి విషయంలో భారత్... విదేశాలపై ఆధారపడే అవసరం కూడా తగ్గుతుంది.
Published by: Krishna Kumar N
First published: August 9, 2020, 9:55 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading