Dalai Lama Birthday: దలైలామా శాంతి సందేశం... టెన్షన్ పడుతున్న చైనా...

Dalai Lama Happy Birthday | టిబెటన్ల బౌద్ధ గురువు దలైలామా... 85వ పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక సందేశం ఇచ్చారు. దీనిపై చైనా ఎందుకు టెన్షన్ పడుతోంది?

news18-telugu
Updated: July 6, 2020, 8:38 AM IST
Dalai Lama Birthday: దలైలామా శాంతి సందేశం... టెన్షన్ పడుతున్న చైనా...
పుట్టిన రోజు నాడు దలైలామా శాంతి సందేశం... టెన్షన్ పడుతున్న చైనా... (credit - youtube)
  • Share this:
భారత్-చైనా మధ్య లడక్ సరిహద్దు వివాదం రగులుతున్నవేళ... టిబెట్ సరిహద్దుల విషయంలో టిబెటన్లకు మద్దతుగా భారత్ ఉన్న సమయంలో... టిబెటన్ల గురువు దలైలామా... నేడు 85వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా... హిమాచల్ ప్రదేశ్‌లేలోని ధర్మశాలలో జరిగే కార్యక్రమాలకు భారత్ మద్దతుగా నిలవడం ఏటా జరిగేదే. ఈ కార్యక్రమాల్ని ఏటా చైనా వ్యతిరేకించడమూ కామనే. ఎందుకంటే... దలైలామా... టిబెట్ నుంచి వచ్చి... భారత్‌లో శరణార్థిగా ఆతిథ్యం పొందుతున్నారు. ఇది టిబెట్‌ను తన అధీనంలో ఉంచుకున్న చైనాకు ఏమాత్రం నచ్చని విషయం. ఇలాంటి పరిస్థితుల్లో టిబెటన్లకు దలైలామా శాంతి సందేశం ఇచ్చారు.



దలైలామా పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు


ఇప్పుడు చైనా ప్రపంచ దేశాల నుంచి ఒంటరి అయ్యింది. కరోనా విషయంలో చైనా వల్లే తమకు ఆ వైరస్ సోకిందని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. పైగా కొత్త కొత్త వైరస్‌లు పుట్టుకొస్తున్నాయి. ఇదే సమయంలో భారత్‌తో సరిహద్దు వివాదానికి తెరతీసి చైనా పెద్ద తప్పే చేసింది. భారత్ లాగా తామూ చైనా యాప్స్‌ని నిషేధిస్తామని చాలా దేశాలు చెబుతున్నాయి. ఇక అమెరికా అయితే... ఈ ఛాన్స్ ఉపయోగించుకొని... చైనా అహంకారాన్ని అణగదొక్కాలని ప్రయత్నిస్తోంది. దలైలామాకు ఇవాళ జరిగే కార్యక్రమాల్ని చైనా తప్పుపడితే... ప్రపంచ దేశాల నుంచి విమర్శలు ఎదుర్కోక తప్పదు.
Published by: Krishna Kumar N
First published: July 6, 2020, 8:38 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading