Home /News /india-china /

CORONA VACCINE IN CHINA HAS GOOD RESULTS IN TWO STAGES MK

Corona Vaccine: అమ్మో చైనా...సైలెంటుగా కరోనా వ్యాక్సిన్ డెవలప్ చేసిందిగా...ఒక్క అడుగు దూరంలో...

(credit - twitter)

(credit - twitter)

చైనాకు చెందిన ప్రముఖ ఔషధ సంస్థ షినోవాక్ బయోటెక్ లిమిటెడ్ (Sinovac Biotech Ltd) శుభవార్త వినిపించింది. ఆ సంస్థ డెవలప్ చేస్తున్న కరోనా వైరస్‌ వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ లో విజయం సాధించింది.

    చైనాలో కరోనావైరస్ రెండవ వేవ్ ప్రపంచవ్యాప్తంగా భయాన్ని సృష్టిస్తోంది. అయితే, కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీలో మాత్రం చైనా శుభవార్త వినిపిస్తోంది. చైనాకు చెందిన ప్రముఖ ఔషధ సంస్థ షినోవాక్ బయోటెక్ లిమిటెడ్ (Sinovac Biotech Ltd) శుభవార్త వినిపించింది. ఆ సంస్థ డెవలప్ చేస్తున్న కరోనా వైరస్‌ వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ లో విజయం సాధించింది. ఇప్పటికే ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం కరోనా వ్యాక్సిన్ తయారీలో ప్రపంచంలోనే అందరికన్నా ముందు వరుసలో నిలిచిందని అంతతా భావించారు. అయితే వ్యాక్సిన్ తయారీలో ఇప్పుడు మరో మైలురాయిని దాటేసింది. ఈ టీకాకు కరోనావాక్(Coronavac) అని పేరు పెట్టారు. ఈ టీకాను హ్యూమన్ ట్రయల్స్ లో పరీక్షించేటప్పుడు ఎలాంటి ప్రమాదకరమైన ప్రభావాలు కనిపించలేదని కంపెనీ తెలిపింది.

    ఈ టీకాలో రెండు డోసులను 14 రోజుల అబ్జర్వేషన్ లో ఉన్న వారికి ఇచ్చారు. వారిపై ఎటువంటి దుష్ప్రభావాలు లేదా ప్రతికూల ప్రభావాలు కనుగొనబడలేదని షినోవాక్ బయోటెక్ ప్రతినిధి చెప్పారు. ఈ విచారణలో, పాల్గొన్న వారిలో 90 శాతం మంది శారీరక రోగనిరోధక శక్తిని పెరిగినట్లు సంస్థ తెలిపింది.

    చైనాలో కరోనావాక్ విచారణ రెండు దశల్లో జరిగిందని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇందులో 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల 743 మంది ఆరోగ్యవంతులపై వ్యాక్సిన్ ప్రయోగించారు. ఈ హ్యూమన్ ట్రయల్స్ లో 143 మంది మొదటి దశలో, రెండో దశలో 600 మంది పాల్గొన్నారు. ఈ వ్యాక్సిన్ 28 రోజుల గ్యాప్ లో ఇచ్చారు.

    బ్రెజిల్‌లో కరోనా వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ కు గ్రీన్ సిగ్నల్...
    షినోవాక్ బయోటెక్ సంస్థ తన మూడవ దశ విచారణను బ్రెజిల్‌లో నిర్వహించడానికి ఈ నెల బుటాన్ ఇనిస్టిట్యూట్‌తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. బ్రెజిల్‌లో కరోనా మహమ్మారి ఇప్పటివరకు 7 మిలియన్లకు పైగా ప్రజలకు సోకింది. దీంతో బ్రెజిల్ లో కరోనా బారిన పడిన ప్రాంతాలలో ఆరోగ్య వంతులైన పలువురిపై మూడవ దశను పరీక్షించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఈ చైనా కంపెనీ ప్రకటించింది. తద్వారా మూడో దశలో వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది అనే ఫలితంపై ఈ వ్యాక్సిన్ మార్కెట్ ప్రవేశం ఆధారపడి ఉంది. మరోవైపు ఆఖరి దశ ట్రయల్స్ నిర్వహించడానికి ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనెకా సంస్థ కూడా టీకా ట్రయల్స్ తమ దేశంలో నిర్వహించుకోమని బ్రెజిల్ అధికారులు ఆమోదం తెలిపారు, కేంబ్రిడ్జ్ మసాచుసెట్స్ ఆధారిత మోడరన్ ఇంక్. (యుఎస్) మోడరనా ఇంక్ సైతం వ్యాక్సిన్ తయారీలో మూడవ దశకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Corona, Corona virus, Coronavirus, Covid-19

    తదుపరి వార్తలు