మన సైనికులను చంపుతారా ?... రాహుల్ గాంధీ ఆగ్రహం

రాహుల్ గాంధీ (File Photo)

చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు చనిపోవడంపై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Share this:
    చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు చనిపోవడంపై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మన సైనికులను చంపడానికి చైనాకు ఎంత ధైర్యం అని ప్రశ్నించారు. మన భూమిని ఆక్రమించుకోవడానికి వారికి ఎంత ధైర్యం అని మండిపడ్డారు. ఇప్పటివరకు జరిగిందని చాలని... అసలు అక్కడ ఏం జరిగిందో మనకు తెలియాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ మౌనాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఆయన ఎందుకు పలు విషయాలను దాచి పెడుతున్నారని అన్నారు. ఇక లద్దాఖ్ సమీపంలోని గాల్వన్ లోయలో ఇండియా, చైనా సైనికులకు మధ్య జరిగిన ఘర్షణల్లో భారీగా ప్రాణ నష్టం జరిగింది. 20 మంది భారత సైనికులు చనిపోయారు.

    Published by:Kishore Akkaladevi
    First published: