ప్రధాని మోదీపై కాంగ్రెస్ ప్రశ్నల వర్షం.. మన జవాన్లు ఎలా చనిపోయారు?

కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్.. ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. చైనా సైనికులు భారత్‌లోకి చొరబడ్డారని రక్షణరంగ నిపుణులు, శాటిలైట్ ఫొటోలు పేర్కొంటున్నాయని.. కానీ ప్రధాని మోదీ మాత్రం ఎవరూ చొరబడలేదని ఎందుకు అన్నారని ఆయన ప్రశ్నించారు.

news18-telugu
Updated: June 21, 2020, 9:06 PM IST
ప్రధాని మోదీపై కాంగ్రెస్ ప్రశ్నల వర్షం.. మన జవాన్లు ఎలా చనిపోయారు?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
గాల్వన్ లోయ ఘర్షణపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోదీని సోనియా గాంధీ పలు ప్రశ్నలు అడిగారు. చైనా జవాన్లు భారత్‌లోకి ఎప్పుడు వచ్చారు? ఎంత లోపలికి వచ్చారు? అక్కడ తాజా పరిస్థితులు ఎలా ఉన్నాయి? మన జవాన్లకు ఆయుధాలు ఎందుకు ఇవ్వలేదు? అని ప్రధాని మోదీపై కాంగ్రెస్ ప్రశ్నల వర్షం.. మన జవాన్లు ఎలా చనిపోయారు? ప్రధాని మోదీపై కాంగ్రెస్ ప్రశ్నల వర్షం.. మన జవాన్లు ఎలా చనిపోయారు? సోనియా ప్రశ్నించారు. ఐతే అఖిలపక్ష భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రధాని మోదీ.. భారత భూభాగంలోకి ఎవరూ చొరబడలేదని స్పష్టం చేశారు. భారత్‌కు చెందిన ఒక్క అంగుళం భూమిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

మోదీ చేసిన ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ మరోసారి తప్పుబట్టింది. అసలు మన భూభాగంలోకి ఎవరూ రాకుంటే..గల్వాన్ ఘర్షణ ఎందుకు జరిగిందని మళ్లీ ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్.. ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. చైనా సైనికులు భారత్‌లోకి చొరబడ్డారని రక్షణరంగ నిపుణులు, శాటిలైట్ ఫొటోలు పేర్కొంటున్నాయని.. కానీ ప్రధాని మోదీ మాత్రం ఎవరూ చొరబడలేదని ఎందుకు అన్నారని ఆయన ప్రశ్నించారు. అధికారిక ప్రకటన నుంచి ఆ పదాలను పీఎంవో ఎందుకు తొలగించిందో చెప్పాలని డిమాండ్ చేశారు కపిల్ సిబాల్. అసలు ఎవరూ రాకుంటే మన సైనికులు 20 మంది ఎలా చనిపోయారు? చైనా సైన్యం చేతిలో ఎలా బందీలయ్యారు? అని నిలదీశారు. అఖిలపక్ష సమావేశం అనంతరం చేసిన వ్యాఖ్యలకు ప్రధాని మోదీ వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

జూన్ 15, 16 తేదీల్లో గల్వాన్ లోయలో భారత్, చైనా జవాన్ల మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘటనలో కల్నల్ సంతోష్ బాబ సహా 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. చైనాకు చెందిన 43 మంది సైనికులు మరణించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఐతే చైనా మాత్రం అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఐతే 20 మంది సైనికులు మరణించడాన్ని భారత్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. చైనాను ఎలా దెబ్బకొట్టాలన్న దానిపై వ్యూహాలు రచిస్తోంది. తామ శాంతికాముకులమని.. కానీ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ ఇప్పటికే హెచ్చరించారు. ఐనప్పటికీ చైనా మాత్రం గల్వాన్ లోయ తమదేనని పదే పదే వాగుతోంది. ఈ క్రమంలోనే చైనా దురాక్రమణలను తిప్పికొట్టేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు తెలుస్తోంది.
First published: June 21, 2020, 9:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading