Home /News /india-china /

COLONEL SANTOSH BABU DEADBODY REACHED TO HAKIMPET AIRPORT BA

హకీంపేట చేరుకున్న కల్నల్ సంతోష్ పార్థివదేహం...

కల్నల్ సంతోష్ బాబు

కల్నల్ సంతోష్ బాబు

రేపు ఉదయం 7.45 గంటలకు సంతోష్ బాబు అంతిమయాత్ర నిర్వహించనున్నారు. సంతోష్‌కు నివాళ అర్పించేందుకు వచ్చే వారు కోవిడ్ 19 నిబంధనలు పాటించాలని పిలుపునిచ్చారు.

    లద్దాక్‌లోని గాల్వన్ లోయలో చైనా లిబరేషన్ ఆర్మీతో జరిగిన ఘర్షణలో జరిగిన అమరుడైన కల్నల్ సంతోష్‌బాబు పార్థివదేహం హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంది. ప్రత్యేక విమానంలో సంతోష్ బాబు భౌతికకాయాన్ని ఆర్మీ అధికారులు తీసుకుని వచ్చారు. తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్‌రాజన్, మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, జగదీష్ రెడ్డి తదితరులు కల్నల్ సంతోష్ పార్థివదేహానికి నివాళి అర్పించారు. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి, సైబరాబాద్ సీపీ సజ్జనార్ తదితరులు కూడా నివాళి అర్పించారు. ఆర్మీ అధికారులు సైనిక వందనం సమర్పించిన అనంతరం సంతోష్ బాబు పార్థివదేహాన్ని ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా సూర్యాపేటకు తరలించనున్నారు. రేపు ఉదయం 7.45 గంటలకు సంతోష్ బాబు అంతిమయాత్ర నిర్వహించనున్నారు. సంతోష్‌కు నివాళ అర్పించేందుకు వచ్చే వారు కోవిడ్ 19 నిబంధనలు పాటించాలని పిలుపునిచ్చారు. సూర్యాపేట వద్ద ఉన్న కేసారంలోని వ్యవసాయ భూమిలో సంతోష్ బాబు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: India-China, Indo China Tension, Suryapet, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు