Home /News /india-china /

CHINESE MEDIA RELEASES PROPAGANDA VIDEO SHOWING TROOP BUILDUP NEAR INDIA BORDER BA

ఇదిగో మా బలం, బలగం.. భారత్ ను ‘బెదిరిస్తూ’ వీడియో రిలీజ్ చేసిన చైనా

భారత ఆర్మీ చెప్పిన వివరాల ప్రకారం 20 మంది భారత సైనికులు చనిపోయారు. 43 మంది చైనా లిబరేషన్ ఆర్మీకి చెందిన వాళ్లు మరణించి లేదా గాయపడి ఉండవచ్చని భావిస్తున్నారు.  (Image: @globaltimesnews/ Twitter)

భారత ఆర్మీ చెప్పిన వివరాల ప్రకారం 20 మంది భారత సైనికులు చనిపోయారు. 43 మంది చైనా లిబరేషన్ ఆర్మీకి చెందిన వాళ్లు మరణించి లేదా గాయపడి ఉండవచ్చని భావిస్తున్నారు. (Image: @globaltimesnews/ Twitter)

బోర్డర్‌లో అవసరం అయితే ఎంత వేగంగా చైనా బలగాలు స్పందిస్తాయని తెలియజేసేందుకు ఈ విన్యాసాలు చేసినట్టు గ్లోబల్ టైమ్స్ రిపోర్ట్ చేసింది.

    భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదంపై మిలటరీ కమాండర్స్ స్థాయిలో చర్చలు జరిపి సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలనే ప్రయత్నం చేసి ఒక్కరోజు కూడా కాకముందే, డ్రాగన్ కంట్రీ మళ్లీ బరితెగించింది. సరిహద్దుల్లో భారీగా మోహరించిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఓ వీడియోను రిలీజ్ చేసింది. వేలాది మంది చైనా సైన్యం బోర్డర్‌లో విన్యాసాలు చేస్తున్న దృశ్యాలను విడుదల చేసింది. గ్లోబల్ టైమ్స్ వార్తా సంస్థ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఆ వీడియోను పోస్ట్ చేసింది. చైనా ఎయిర్ ఫోర్స్‌తోపాటు ఆర్మీ మిలటరీ ఎక్సర్‌సైజ్ చేస్తున్న దృశ్యాలు ఉన్నాయి. సెంట్రల్ చైనాలోని హుబే ప్రావిన్స్‌కు ఈశాన్యంలో ఈ వీడియోను తీసినట్టు గ్లోబల్ టైమ్స్ తెలిపింది. ‘బోర్డర్‌లో అవసరం అయితే ఎంత వేగంగా చైనా బలగాలు స్పందిస్తాయని తెలియజేసేందుకు ఈ విన్యాసాలు చేసింది. ఈ మొత్తం ప్రక్రియ అంతా కేవలం కొన్ని గంటల్లోనే పూర్తయింది.’ అని ఆ సంస్థ పేర్కొంది. మిలటరీ ఆయుధాలు, వాహనాలు పెద్ద ఎత్తున ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నట్టు తెలిపింది.



    భారత్, చైనా మధ్య జరుగుతున్న సరిహద్దు వివాదంపై జూన్ 6న రెండు దేశాలు మిలటరీ కమాండెంట్ల స్థాయిలో చర్చలు జరిగాయి. భారత్ నుంచి కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనా తరఫున కమాండర్ ఆఫ్ సౌత్ జిన్ జియాంగ్ మిలటరీ డిస్ట్రిక్ మేజర్ జనరల్ లిన్ లి హు చర్చల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏప్రిల్‌కు ముందు ఉన్న పరిస్థితిని కొనసాగించాలని భారత్ కోరింది. అయితే, సరిహద్దుల్లో భారత్ ఎలాంటి రోడ్డు నిర్మాణాలు చేపట్టవద్దని చైనా సూచించింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: China, India-China, Indo China Tension

    తదుపరి వార్తలు