హోమ్ /వార్తలు /ఇండో చైనా /

China: చైనా చిటికేస్తే...టాప్ 100 కార్పోరేట్ కంపెనీలు మటాష్...అమెరికా సంచలన రిపోర్ట్...

China: చైనా చిటికేస్తే...టాప్ 100 కార్పోరేట్ కంపెనీలు మటాష్...అమెరికా సంచలన రిపోర్ట్...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

చైనా సైబర్ వార్‌కు వ్యూహానికి పదును పెట్టింది. తన కనుసన్నల్లో పనిచేసే వేలాది మంది హ్యాకర్లను ప్రపంచంలోనే టాప్ కార్పోరేట్ కంపెనీల్లో పనిచేస్తున్నారు. దీంతో డ్రాగన్ చిటికేస్తే... ప్రపంచ ఆర్థిక వ్యవస్థే చిన్నా భిన్నం అవ్వడం ఖాయమని అమెరికా నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

ఇంకా చదవండి ...

చైనా సైబర్ వార్‌కు వ్యూహానికి పదును పెట్టింది. తన కనుసన్నల్లో పనిచేసే వేలాది మంది హ్యాకర్లను ప్రపంచంలోనే  టాప్ కార్పోరేట్ కంపెనీల్లో పనిచేస్తున్నారు. దీంతో డ్రాగన్ చిటికేస్తే... ప్రపంచ ఆర్థిక వ్యవస్థే చిన్నా భిన్నం అవ్వడం ఖాయమని అమెరికా నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.  ఇప్పటికే చైనీస్ హ్యాకర్స్ ప్రపంచంలోని 100 కి పైగా దిగ్గజ కార్పోరేట్ సంస్థల్లో చొరబడి పనిచేస్తున్నారని, వారంతా డ్రాగన్ ప్రభుత్వం వ్యూహాన్ని రూపొందించడానికి వారి డేటా చౌర్యానికి పాల్పడుతున్నారు. ఇదే విషయాన్ని అమెరికా న్యాయ శాఖ తెలిపింది. ఇంటెలిజెన్స్, నెట్‌వర్క్ హైజాకింగ్, బ్లాక్ మెయిల్ చేసి టాప్ పొజిషన్స్ లో ఉన్న వారిని బెదిరించడం ద్వారా సమాచారాన్ని దొంగిలించడం దీని వెనుక చైనా హ్యాకర్ల ఉద్దేశ్యం. ఈ సైబర్ దాడి ద్వారా చైనా తన ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూర్చడానికి మరియు ప్రపంచ సూపర్ పవర్‌గా మారడానికి ప్రయత్నిస్తోందని అమెరికా ప్రభుత్వం ఆరోపించింది. డిప్యూటీ అటార్నీ జనరల్ జాఫ్రే ఎ. రోచెన్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ వ్యవస్థపై ఉద్దేశపూర్వకంగా చైనా సైబర్ దాడులకు కారణమవుతోందని పేర్కొంది. హ్యాకర్లకు చైనా పూర్తి దన్నుగా నిలుస్తోందని పేర్కొంది.

టాప్ కంపెనీల్లో పనిచేస్తున్న ఈ హ్యాకర్లందరికీ చైనాతో సంబంధాలు ఉన్నాయని, అంతేకాదు వీరంతా ప్రపంచవ్యాప్తంగా హ్యాకింగ్, దొంగతనాలకు చైనా నుండి ఉచిత లైసెన్స్ పొందారని కొలంబియా జిల్లాకు USA న్యాయవాది మైఖేల్ ఆర్. సెర్విన్ ఆరోపించారు. ఆరోపణల ప్రకారం, జెంగ్ హౌరన్, టెన్ డైలిన్, జియాంగ్ లిజి, కియాన్ చువాన్, ఫు కియాంగ్ వంటి సంస్థలు సోషల్ మీడియా, టెక్నాలజీ, కార్పోరేట్ కంపెనీలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు ఇలా మొదలైన కీలక వ్యవస్థలే లక్ష్యంగా చేసుకున్నాయని ఆయన ఆరోపించారు. సైబర్ దాడుల కోసమే వీరిని ఉపయోగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు వీరు ఆయా కంపెనీల్లో పనిచస్తూ సాఫ్ట్‌వేర్ లను తయారు చేస్తారని, అందులో తాము తయారు చేసిన ఉత్పత్తుల్లో హానికరమైన కోడ్‌ను ఉంచుతారని. వీటి వివరాలను మరొక సిస్టమ్‌కు అప్‌లోడ్ అయిన తర్వాత, హ్యాకర్లు వాటిని విచ్ఛిన్నం చేయడానికి తమ కోడ్‌ను ఉపయోగిస్తారని, ఓ సైబర్ నిపుణుడు పేర్కొన్నాడు.

అంతేకాదు ఈ హ్యాకర్లు మలేషియన్లతో కలిసి, వీడియో గేమ్ పరిశ్రమ ద్వారా కూడా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతోందని అమెరికాకు చెందిన నిఘా ఏజెన్సీలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే సైబర్ చౌర్యంకు సంబంధించిన కేసులో మలేషియాలో వాంగ్ ఓంగ్ హువా, లింగ్ యాంగ్ చింగ్ అనే ఇద్దరు పారిశ్రామికవేత్తలను సోమవారం అరెస్టు చేశారు. అయితే ఈ హ్యాకర్లను పట్టుకునేందుకు, సైబర్ రీసెర్చ్ గ్రూప్ పేర్లలో అడ్వాన్స్‌డ్ పెర్సిస్టెంట్ థ్రెట్ 41, బేరియం, వింటీ, వికెడ్ పాండా, పాండా స్పైడర్ వంటి సాఫ్ట్ వేర్ ద్వారా వీరిని ట్రాక్ చేసినట్లు అధికారులు తెలిపారు. సైబర్ సెక్యూరిటీ కంపెనీ మీడియంట్‌లోని థ్రెట్ ఇంటెలిజెన్స్ సీనియర్ డైరెక్టర్ జాన్ హల్ట్‌క్విస్ట్ మాట్లాడుతూ, ఈ హ్యాకర్లు మాల్ వేర్లను వ్యాప్తి చేయడానికి వీడియో గేమ్ పంపిణీదారులతో ఒప్పందం కుదుర్చుకున్నానని ఆయన పేర్కొన్నారు.

కాలిఫోర్నియా సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్‌స్ట్రైక్ పరిశోధకులు లాభాల కోసం హ్యాకింగ్ చేస్తున్న వికెడ్ స్పైడర్ అనే సమూహాన్ని కనుగొన్నారు. ఇది 2015 లో ప్రారంభమైంది. ప్రధానంగా గేమింగ్ సంస్థలను లక్ష్యంగా చేసుకున్న ఈ బృందం, అమెరికా, జర్మనీ, హాంకాంగ్, తైవాన్, దక్షిణ కొరియాలోని ఉన్నత స్థాయి పాలసీ బ్లూప్రింట్, వ్యవసాయం, ఆతిథ్యం, ​​రసాయనాలు, తయారీ, సాంకేతిక పరిజ్ఞానం వ్యవస్థలపై దాడి చేయడం ప్రారంభించిందని ఆ సంస్థ తెలిపింది. గత కొన్నేళ్లలో హ్యాకర్లను పట్టుకునేందుకు, Verizone, Microsoft, Facebook,google మరియు ఆల్ఫాబెట్ దర్యాప్తులో అమెరికా ప్రభుత్వానికి సహాయపడ్డాయి.

First published:

Tags: China, China App Ban, India-China, US-China

ఉత్తమ కథలు