సైబర్ వార్‌కు చైనా సై...వారంలో 40 వేల సార్లు ఇండియన్ సర్వర్లపై దాడి...

జూన్ 15 గాల్వన్ లోయలో ఘర్షణ తర్వాత సైబర్ దాడులు చేయడానికి చైనా హ్యాకర్లు 40,300 సార్లు ప్రయత్నించినట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

news18-telugu
Updated: June 23, 2020, 10:25 AM IST
సైబర్ వార్‌కు చైనా సై...వారంలో 40 వేల సార్లు ఇండియన్ సర్వర్లపై దాడి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భారతీయ సైనికులతో గాల్వన్ లోయలో ఘర్షణ తరువాత, చైనా తన కుయుక్తిని బయటపెట్టింది. భారత సర్వర్లపై సైబర్‌టాక్‌లతో చైనీస్ హాకర్లు విరుచుకుపడుతున్నారు. భద్రతా సంస్థలతో అనుబంధం ఉన్న డేటా సర్వర్లపై జూన్ 15 నుండి నేటి వరకు చైనీస్ హ్యాకర్లు దాదాపు నలభై వేలకు పైగా ప్రయత్నాలు చేశారని ఓ షాకింగ్ న్యూస్ బయటపడింది. జూన్ 15 గాల్వన్ లోయలో ఘర్షణ తర్వాత సైబర్ దాడులు చేయడానికి చైనా హ్యాకర్లు 40,300 సార్లు ప్రయత్నించినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సైబర్ దాడులలో ఎక్కువ భాగం చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ నుంచి వచ్చినట్లు సమాచారం. సిచువాన్ ప్రాంతం చైనా సైబర్ వార్‌ఫేర్ ప్రధాన కార్యాలయం. ఈ దాడులు చైనా ప్రభుత్వం ప్రేరేపించినవా... లేదా పూర్తిగా ప్రైవేట్ శక్తుల పనా అనేది నిర్ధారించడానికి భారత అధికారులు ఆధారాలు కనుగొంటున్నారు.

ఇండియన్ సైబర్ స్పేస్ పై దాడి చేయడానికి ప్రధానంగా రెండు టెక్నాలజీలను ఉపయోగిస్తున్నారు. మొదటిది 'డిస్ట్రిబ్యూటెడ్ డినైయల్ ఆఫ్ సర్వీస్', దీనిలో యుటిలిటీ ప్రైవేట్ వెబ్‌సైట్ లు వేల సంఖ్యలో రిక్వెస్ట్ లను మాత్రమే అంగీకరిస్తాయి. అయితే చైనీస్ హ్యాకర్లు వాటి సామర్థ్యాన్ని పది లక్షలకు పెంచుతారు. అప్పుడు సెటప్ క్రాష్‌కు దారితీస్తుంది. హ్యాకర్లు తీసుకుంటున్న రెండవ మార్గం 'ఇంటర్నెట్ ప్రోటోకాల్ హైజాక్', దీనిలో హ్యాకర్లు చైనా ద్వారా ఇంటర్నెట్ ట్రాఫిక్‌ను తమ నిఘా ప్రయోజనం కోసం మళ్లించవచ్చు. చైనా భారత్‌పై అన్ని రకాల యుద్ధాలను ఉపయోగిస్తోంది. ప్రస్తుతం చైనా హైబ్రిడ్ వార్‌ఫేర్ ను ఎదుర్కొనేందుకు నిపుణులు రేయింబవళ్లు కష్టపడుతున్నారు.
First published: June 23, 2020, 10:25 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading