India-China: దిగొస్తున్న డ్రాగన్.. రాజ్‌నాథ్‌తో భేటీకి చైనా రక్షణమంత్రి ఆసక్తి

భారత్‌-చైనా సరిహద్దు వివాదం కేవలం దౌత్యపరంగా, చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని భావిస్తున్నట్లు విదేశాంగ మంత్రి జైశంకర్‌ వ్యాఖ్యానించిన కొన్ని గంటల వ్యవధిలోనే చైనా నుంచి భేటీ ప్రతిపాదన వచ్చింది.

news18-telugu
Updated: September 4, 2020, 11:21 AM IST
India-China: దిగొస్తున్న డ్రాగన్.. రాజ్‌నాథ్‌తో భేటీకి చైనా రక్షణమంత్రి ఆసక్తి
రాజ్‌నాథ్ సింగ్
  • Share this:
సరిహద్దుల్లో చెలరేగిపోతున్న చైనాకు భారత సైన్యం అదే స్థాయిలో ధీటుగా జవాబిస్తోంది. డ్రాగన్ ఎత్తులను చిత్తుచేస్తూ వారి కుట్రలను తిప్పికొడుతోంది. ఈ క్రమంలో మెల్లమెల్లగా దిగొస్తోంది చైనా. మాస్కోలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ(NCO) సదస్సు సందర్భంగా చైనా రక్షణ శాఖ మంత్రి వీ ఫెంజీ భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో భేటీ అయ్యేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు భారత దౌత్యాధికారులకు చైనా ప్రతినిధులు సమాచారం ఇచ్చారు. దీనిపై భారత్ రక్షణ శాఖ ఎలాంటి నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఐతే చైనాతో భేటీకి రాజ్‌నాథ్ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

భారత్‌-చైనా సరిహద్దు వివాదం కేవలం దౌత్యపరంగా, చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని భావిస్తున్నట్లు విదేశాంగ మంత్రి జైశంకర్‌ వ్యాఖ్యానించిన కొన్ని గంటల వ్యవధిలోనే చైనా నుంచి భేటీ ప్రతిపాదన వచ్చింది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వీరిద్దరి భేటీ హాట్ టాపిక్‌గా మారింది.

కాగా, ఆగస్టు 29న అర్ధరాత్రి సరిహద్దుల్లో చైనా ఆర్మీ మళ్లీ చెలరేగిన విషయం తెలిసిందే. పాంగాంగ్‌ సరస్సు దక్షిణ తీరాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నించడంతో భారత సైన్యం తిప్పికొట్టింది. ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. చైనా ఎత్తును చిత్తు చేస్తూ.. పాంగాంగ్‌ సరస్సు దక్షిణ భాగంలో ఎత్తయిన వ్యూహాత్మక ప్రాంతాలను తన స్వాధీనంలోకి తెచ్చుకుంది భారత సైన్యం. అంతేకాదు ఉత్తర తీరంలోని కీలకమైన ఫింగర్‌ 2, ఫింగర్ 3 ప్రాంతాల్లో మోహరించి చైనా ఒత్తిడి పెంచింది. పెద్ద మొత్తంలో ఆయుధాలను కూడా తరలించింది. ఈ క్రమంలోనే చైనా మెల్లగా దిగొస్తోంది. అందుకే రక్షణమంత్రితో చర్చల ప్రతిపాదనను తీసుకొచ్చింది.
Published by: Shiva Kumar Addula
First published: September 4, 2020, 11:20 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading