Home /News /india-china /

CHINESE APP BAN INDIAN PUBG PLAYERS LOOKS FOR ALTERNATIVES

PUBG Ban: ఆట ముగిసినట్లే...ప్రత్యామ్నాయాల వేటలో పబ్‌జీ ప్లేయర్స్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Chinese App Ban | PUBGని దేశంలో బ్యాన్ చేయడం ఖాయంగా తెలుస్తుండటంతో దేశంలోని ఆన్‌లైన్ గేమ్ ప్లేయర్స్ ప్రత్యామ్నాయాల కోసం వెతుకులాట ప్రారంభించారు.

    టిక్ టాక్ సహా 59 చైనా యాప్‌లను గత నెల చివర్లో బ్యాన్ చేసిన భారత ప్రభుత్వం...సోమవారం మరో 47 చైనా యాప్‌లపై కొరడా ఝళిపించడం తెలిసిందే. దీంతో ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇప్పటి వరకు 106 చైనా యాప్‌లపై వేటు వేసినట్లయ్యింది. మరో లిస్ట్‌ను కూడా కేంద్రం సిద్ధంచేస్తోంది.  డ్రాగన్ దేశానికి చెందిన మరో 275 యాప్‌లను నిషేధించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. తదుపరి వేటువేయనున్న యాప్స్ జాబితాను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ సిద్ధం చేస్తుండగా... ఇందులో ప్రముఖ ఆన్‌లైన్ గేమ్ పబ్‌జీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే చైనా దిగ్గజ సంస్థ అలీబాబా గ్రూప్‌కు చెందిన అలిఎక్స్‌ప్రెస్ మరికొన్ని యాప్స్‌ను తదుపరి జాబితాలో చేర్చనున్నారు. అలాగే టిక్ టాక్ మాతృ సంస్థ బైట్ డాన్స్‌కి చెందిన యులైక్, రెస్సో‌తో పాటు జిలి తదితర యాప్స్ తదుపరి జాబితాలో ఉండే అవకాశమున్నట్లు సమాచారం. దేశ అంతర్గత భద్రత, ప్రజల వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలిగిస్తున్నాయన్న అనుమానాలపై వీటిపై కేంద్రం వేటువేయనుంది. చైనా సంస్థలకు ఈ యాప్‌లు భారతీయ వినియోగదారుల డేటాను అందజేస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

    PUBG Mobile, AliExpress, Ludo World, bytedance, TikTok, 59 Chinese apps banned, India bans china apps, 59 china apps ban, india china war, india china border, 59 చైనా యాప్స్‌పై నిషేధం, చైనీస్ యాప్స్, ఇండియా చైనా వార్, ఇండియా చైనా సరిహద్దు గొడవలు, చైనా యాప్స్ నిషేధం, పబ్‌జీ మొబైల్, లూడోవాల్డ్, అలీ ఎక్స్‌ప్రెస్, టిక్‌టాక్, బైట్ డ్యాన్స్
    (ప్రతీకాత్మక చిత్రం)


    ఆన్‌లైన్ గేమ్ యాప్ పబ్‌జీని బ్యాన్ చేస్తారన్న కథనాలు దేశంలోని ఆన్‌లైన్ గేమ్స్ ప్లేయర్స్ మధ్య చర్చనీయాంశంగా మారింది. తమ ఫేవరెట్ యాప్‌(పబ్‌జీ)ని ప్రభుత్వం బ్యాన్ చేయదని ఇప్పటికీ తాము నమ్ముతున్నట్లు పబ్‌జీకి బానిసలైన ప్లేయర్స్ ధీమా వ్యక్తంచేస్తున్నారు. అదే సమయంలో పబ్‌జీకి ప్రత్యామ్నాయంగా దేశానికి చెందిన ఆన్ లైన్ గేమ్స్ కోసం ఆన్‌లైన్ గేమ్ ప్లేయర్స్ వెతుకులాట ప్రారంభించారు. అయితే పబ్‌‌జీకి ధీటైన గేమ్ ఏదీ దేశంలో లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

    పబ్‌జీని బ్యాన్ చేయనున్న కేంద్రం


    దేశ సమగ్రత, వ్యక్తిగత ప్రైవసీకి పబ్‌జీ భంగం కలిగిస్తున్నట్లు ప్రభుత్వం భావిస్తే...దాన్ని బ్యాన్ చేయాలని మీరట్‌కు చెందిన ఓ ప్రొఫషనల్ పబ్‌జీ ప్లేయర్ అభిప్రాయపడ్డాడు. అదే సమయంలో పబ్‌జీకి ధీటైన ఆన్‌లైన్ గేమ్‌ను దేశంలోని గేమింగ్ కంపెనీలు డెవలప్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరాడు.

    ప్రపంచ వ్యాప్తంగా పబ్‌జీ‌లో ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్న ప్లేయర్స్ వ్యక్తిగత సమాచారాన్ని ఆ సంస్థ చైనా ప్రభుత్వంతో పంచుకుంటున్నట్లు సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఆరోపిస్తున్నారు. పబ్‌జీతో పాటు చైనాకు చెందిన యాప్స్ అన్నిటినీ బ్యాన్ చేయాలని సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా పబ్‌జీ గేమ్ ఆడుతున్న ప్రభుత్వ, సైనిక అధికారులు, సైనిక సిబ్బంది వ్యక్తిగత విషయాలు కూడా చైనా ప్రభుత్వం, చైనా ఆర్మీ చేతికి చేరిపోతోందని అనుమానం వ్యక్తంచేశారు.
    Published by:Janardhan V
    First published:

    Tags: China App Ban, India-China, Indo China Tension, PUBG, Tik tok

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు