Home /News /india-china /

CHINAS WUHAN INSTITUTE SIGNS COVERT DEAL WITH PAK MILITARY FOR BIO WARFARE CAPABILITIES AGAINST INDIA BA

చైనా వుహాన్ ల్యాబ్‌తో పాక్ ఆర్మీ ఒప్పందం... భారత్‌పై ఈ వైరస్ వదలబోతున్నాయా?

చైనా, పాకిస్తాన్ జెండా ప్రతీకాత్మక చిత్రం

చైనా, పాకిస్తాన్ జెండా ప్రతీకాత్మక చిత్రం

చైనాలోని వుహాన్ ‌లో ఉన్న వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో పాకిస్తాన్‌ ఆర్మీకి చెందిన మిలటరీ డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్గనైజేషన్ ఒప్పందం కుదుర్చుకుంది.

    చైనాలోని వుహాన్ ‌లో ఉన్న వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో పాకిస్తాన్‌ ఆర్మీకి చెందిన మిలటరీ డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్గనైజేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని ఇండియాటీవీ రిపోర్ట్ చేసింది. ఆ కథనం ప్రకారం భారత్‌పై ఈ రెండు దేశాలు బయో అస్త్రాన్ని సిద్ధం చేయడానికి ఈ డీల్ కుదుర్చుకున్నట్టు అభిప్రాయపడింది. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కోవిడ్ 19 వుహాన్‌లో ఉన్న ఈ వైరాలజీ ల్యాబ్‌లోనే సృష్టించారనే ఆరోపణలు ఉన్నాయి. అలాంటి సంస్థతో పాకిస్తాన్ ఆర్మీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందానికి పెట్టిన పేరు.. ‘విస్తరించే వ్యాధులను అరికట్టడానికి పరిశోధనలు చేయడం. ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే వ్యాధులను కట్టడి చేయడం.’

    ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చును మొత్తం చైనానే భరిస్తుందని, అయితే పేరుకు మాత్రం సంయుక్త భాగస్వామ్యం అని పేరు పెట్టినట్టు ఇండియా టీవీ తెలిపింది. కరోనా వైరస్‌ను ప్రపంచంపై చైనా సంధించిన బయో వెపన్‌గా భావిస్తున్న సమయంలో డ్రాగన్ కంట్రీ తమ పరిశోధనలను పాకిస్తాన్‌లో చేయడం ద్వారా ప్రపంచం దృష్టికి తమ మీద నుంచి మళ్లించవచ్చని భావిస్తోంది. ఈ రెండు దేశాలు కలసి ఆంత్రాక్స్ మీద ప్రయోగాలు చేస్తున్నట్టు తెలిసింది. పాకిస్తాన్‌కు చెందిన సైంటిస్టులకు వుహాన్ ల్యాబ్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తోంది. పాకిస్తాన్ తమ సొంత వైరస్ డేటా బేస్‌ను తయారు చేసుకోవడానికి సాయం చేస్తోంది.

    ఈ పరిశోధన మీద పర్యవేక్షణ చేసే అధికారాన్ని పాకిస్తాన్ ప్రభుత్వ హెల్త్ డిపార్ట్ మెంట్‌, యూనివర్సిటీలకు కూడా లేకుండా చేశారు. తమ సొంత గడ్డ మీద పరిశోధనలు చేసి ప్రజల ప్రాణాలు తీసే కంటే పాకిస్తాన్ లాంటి దేశంలో పరిశోధనలు చేయడం వల్ల ఏదైనా నష్టం జరిగితే ఆ దేశానికే నష్టం వస్తుందనే ఆలోచనలో చైనా ఉంది. ఈ రెండు దేశాలు కలసి CCHFV అనే ఓ రకమైన జ్వరాన్ని కలిగించే వైరస్ మీద ముమ్మర పరిశోధనలు చేస్తున్నాయి. ఈ రకమైన జ్వరం వచ్చిన వారిలో 25 శాతం మంది చనిపోయే ప్రమాదం ఉంది. అత్యధిక రిస్క్‌ను కలిగించే వైరస్ కేటగిరీలో CCHFV కూడా ఉంది. CCHFV పరిశోధనలు చేయగలిగిన స్థాయిలో సౌకర్యాలు కూడా లేని బయో ల్యాబ్‌లో పాకిస్తాన్ ఈ CCHFV టెస్టులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Coronavirus, India VS Pakistan, Indo China Tension

    తదుపరి వార్తలు