లడఖ్‌లో ప్రధాని మోదీ పర్యటనపై స్పందించిన చైనా

లడఖ్‌లో ఇండియా, చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో... అక్కడ పరిస్థితిని భారత్ ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తోంది.

news18-telugu
Updated: July 3, 2020, 1:43 PM IST
లడఖ్‌లో ప్రధాని మోదీ పర్యటనపై స్పందించిన చైనా
లడఖ్‌లో ప్రధాని మోదీ పర్యటన
  • Share this:
లడఖ్‌లో ప్రధాని నరేంద్రమోదీ పర్యటనపై చైనా స్పందించింది. ప్రస్తుతం చైనా, భారత్ మిలిటరీ, ద్వైపాక్షిక చర్చల ద్వారా ఉద్రిక్తతలు తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజాన్ అన్నారు. ఇలాంటి సమయంలో ఎవరూ చర్యలు తీసుకునే దిశగా వ్యవహరించవద్దని అన్నారు. ఇలా చేయడం వల్ల పరిస్థితులు దిగజారుతాయని అన్నారు. అంతకముందు ప్రధాని నరేంద్రమోదీ హఠాత్తుగా లడఖ్ పర్యటనకు వెళ్లారు. లడఖ్‌లో ఇండియా, చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో... అక్కడ పరిస్థితిని భారత్ ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తోంది.ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ హఠాత్తుగా లడఖ్‌లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిన్న రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ లడఖ్ పర్యటన వాయిదా పడిన తరుణంలో ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా ఇక్కడికి రావడం విశేషం. ప్రధానితో పాటు సైనిక ఉన్నతాధికారులు లడఖ్ చేరుకున్నారు. వారితో ఇక్కడి తాజా పరిస్థితులపై ప్రధాని మోదీ సమీక్ష నిర్వహిస్తున్నారు.
First published: July 3, 2020, 1:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading