జవాన్లు ఆయుధాలతోనే వెళ్లారు.. రాహుల్‌కు జైశంకర్ కౌంటర్

ప్రతీకాత్మక చిత్రం

కొందరు భారత జవాన్లు అదృశ్యమయ్యారని.. వారిని చైనా బందీలుగా తీసుకుందని ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని కేంద్రం ఖండించింది.

 • Share this:
  గల్వాన్ లోయలో చైనా, భారత జవాన్ల ఘర్షణపై రాజకీయ దుమారం రేగుతోంది. చైనా బలగాలు భారత్ భూభాగంలోకి చొచ్చుకొస్తున్నా ప్రధాని మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారని విపక్షలు మండిపడుతున్నాయి. అంతేకాదు జవాన్లకు ఆయుధాలు ఇవ్వకుండా కాపలాకు పంపిస్తున్నారని కేంద్రంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. వారి చేతికి ఆయుధాలు ఇవ్వకపోవడం వల్లే మరణిస్తున్నారని ట్విటర్ వేదికగా విరుచుకుపడ్డారు. ఐతే ఆయన ట్వీట్‌కు విదేశాంగమంత్రి జైశంకర్ కౌంటర్ ఇచ్చారు.

  మనందరం నిజాలు తెలుసుకుందాం. సరిహద్దు విధుల్లో ఉన్నప్పుడు జవాన్లు తమ వెంట ఆయుధాలను తీసుకెళ్తారు. ముఖ్యంగా పోస్ట్‌ల నుంచి బయటకు వెళ్లినప్పుడు వారతో ఖచ్చితంగా ఆయుధాలు ఉంటాయి. జూన్ 15న కూడా వారు ఆయుధాలు తీసుకెళ్లారు. 1996, 2005 ఒప్పందాల ప్రకారం లాంగ్ స్టాండింగ్ ప్రాక్టీస్‌లో ఉన్నప్పుడే ఆయుధాలు తీసుకెళ్లరు.
  జైశంకర్, విదేశాంగమంత్రి  కాగా, జూన్ 15, 16 తేదీల్లో గల్వాన్ లోయంలో భారత్, చైనా సైనికులు ఘర్షణకు దిగారు. 45 ఏళ్ల ఈ స్థాయిలో హింసాత్మక ఘర్షణకు దిగడం ఇదే తొలిసారి. ఇరు వర్గాల ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. అటు 43 మంది చైనా సైనికులు కూడా చనిపోయినట్లు అంతర్జాతీయ కథనాలు చెబుతున్నాయి. కానీ దీనిపై చైనా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఐతే కొందరు భారత జవాన్లు అదృశ్యమయ్యారని.. వారిని చైనా బందీలుగా తీసుకుందని ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. గల్వాన్ ఘర్షణల్లో ఎవరూ మిస్ కాలేదని స్పష్టం చేసింది.
  Published by:Shiva Kumar Addula
  First published: