చైనాను దుష్ట దేశంగా అభివర్ణించిన ప్రధాని మోదీ?... మన్ కీ బాత్‌లో సంస్కృత శ్లోకంతో...

Mann Ki Baat : చైనాతో సరిహద్దుల్లో ఘర్షణకు సంబంధించి ప్రధాని మోదీ మన్ కీ బాత్‌లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: June 28, 2020, 2:30 PM IST
చైనాను దుష్ట దేశంగా అభివర్ణించిన ప్రధాని మోదీ?... మన్ కీ బాత్‌లో సంస్కృత శ్లోకంతో...
చైనాను దుష్ట దేశంగా అభివర్ణించిన ప్రధాని మోదీ?... మన్ కీ బాత్‌లో సంస్కృత శ్లోకంతో...
  • Share this:
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈసారి మన్‌ కీ బాత్‌లో పలికిన ఓ సంస్కృత శ్లోకంపై ఇప్పడు చర్చ నడుస్తోంది. "మన దేశంలో ఓ సామెత ఉంది... విద్య ధనం మదయ... శక్తి పర్షామ్ పరక్షిద్ ఖలశ్య సధోకా" అని మోదీ అన్నారు... దాని అర్థం ఏంటి అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. దాని అర్థాన్ని ప్రధాని మోదీ... హిందీలో వివరించారు. "ఓ వ్యక్తిలో చెడు స్వభావం ఉంటే... అతను తన విద్యను తెలివితేటల్నీ... వివాదాల కోసం, డబ్బు కోసం, స్వార్థం కోసం, ఇతరుల్ని నాశనం చేయడం కోసం వాడుతారు" అని తెలిపారు. భారత దేశం ఎప్పుడూ... ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని భారత్.... దేశ స్వాతంత్ర్యాన్ని, సార్వభౌమత్వాన్నీ కాపాడేందుకు తన సొంత శక్తిని వినియోగిస్తుంది అని మోదీ తెలిపారు.

దేశ లక్ష్యం... ఇతరులకు సాయం చేయడం, సంప్రదాయాల్ని కాపాడటం, నమ్మకాన్ని కలగివుండటం, స్నేహ హస్తం చాటడం అని మోదీ తెలిపారు. సంబంధాల్ని కొనసాగించడమే భారత్ ఆలోచన అన్న మోదీ... ఇవే ఆదర్శ భావాలతో మనం ఉంటామని భారతీయుల్ని ఉద్దేశించి మోదీ అన్నారు.



ప్రపంచం సమస్యల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం ద్వారా భారత్... శాంతి, అభివృద్ధిలో మరింత బలోపేతం అయ్యిందన్నారు ప్రధాని మోదీ. భారత్ తన సరిహద్దుల్నీ, సార్వభౌమత్వాల్నీ కాపాడుకునేందుకు ఎంత శక్తిమంతమైనదో ప్రపంచం దేశాలకు తెలుసన్నారు మోదీ. లడక్‌లో భారత గడ్డపై కన్నేసిన వారికి ఎలాంటి గతి పట్టిందో తెలుసన్నారు మోదీ. ఇండియాకి స్నేహ హస్తం ఎలా చాటాలో తెలుసన్న మోదీ... తగిన సమాధానం ఎలా చెప్పాలో కూడా తెలుసన్నారు. భారత సైనికులు... ఎట్టి పరిస్థితుల్లో భారత దేశ గౌరవం తగ్గే పరిస్థితి రానివ్వబోరని మోదీ మన్ ‌కీ బాత్‌లో అభిప్రాయపడ్డారు.జూన్ 15 నాటి చైనా-భారత్ ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులవ్వడంపై దేశంలోని ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతున్నారని మోదీ అన్నారు. అమరులైన సైనికుల తల్లిదండ్రులు మరింత మందిని తమవారిని సైన్యంలోకి పంపేందుకు సిద్ధంగా ఉన్నారనీ... అది మన బలం అని మోదీ అన్నారు. ఈ సందర్భంగా... బీహార్‌లోని బలిదానీ కుందన్ కుమార్... తన మనవళ్లను కూడా ఆర్మీకి పంపి... దేశాన్ని కాపాడాతానని చెప్పిన మాటల్ని మోదీ గుర్తుచేశారు. మొత్తంగా చైనాను ఉద్దేశించే... ప్రధాని మోదీ ఆ సంస్కృత శ్లోకం చెప్పినట్లు తెలుస్తోంది.
First published: June 28, 2020, 2:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading