Home /News /india-china /

CHINA CONTINUES TO MAINTAIN PRESENCE OF 40000 TROOPS ON LADAKH FRONT BA

బుద్ధి మారని చైనా.. బోర్డర్‌లో 40వేల మంది చైనీస్ బలగాలు..

చైనా ఆర్మీ  (ఫైల్ ఫొటో)

చైనా ఆర్మీ (ఫైల్ ఫొటో)

భారత్, చైనా సరిహద్దులోని వాస్తవాధీన రేఖ వద్ద ఇంకా 40వేల మంది చైనీస్ బలగాలు మోహరించి ఉన్నాయని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    భారత్, చైనా సరిహద్దులోని వాస్తవాధీన రేఖ వద్ద ఇంకా 40వేల మంది చైనీస్ బలగాలు మోహరించి ఉన్నాయని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. భారత్, చైనా మధ్య జరిగిన చర్చల్లో భాగంగా బోర్డర్ నుంచి వెనక్కి జరగాలని అంగీకారానికి వచ్చాయి. కానీ, చైనా మాత్రం ఇంకా ఎల్ఏసీ వద్ద 40వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించి ఉందని ఏఎన్ఐ తెలిపింది. ముఖ్యంగా లద్దాక్ వైపు ఈ బలగాలు ఉన్నట్టు పేర్కొంది. ‘సరిహద్దుల నుంచి వెనక్కి మళ్లాలన్న చర్చల ఒప్పందాన్ని చైనా అమలు చేయడం లేదు. ఇంకా భారీగానే చైనీస్ బలగాలు సరిహద్దుల్లో ఉన్నాయి. సుమారు 40వేల మంది వరకు భారీ ఆయుధాలు, డిఫెన్స్ సిస్టమ్‌తో మోహరించి ఉన్నారు.’ అని ఉన్నతాధికారులను ఉటంకిస్తూ ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    అయితే, కొన్ని ప్రాంతాల్లో మాత్రం రెండు దేశాల బలగాలు వెనక్కి జరిగాయి. పాంగాంగ్ సో ప్రాంతంలో 4-5 కిలోమీటర్ల దూరాన్ని పాటిస్తున్నాయి. పెట్రోలింగ్ పాయింట్ 14 వద్ద ఇరు దేశాల సైన్యం చెరో 1.5 కిలోమీటర్లు దూరం జరిగాయి. అంటే ఇద్దరి మధ్య 3 కిలోమీటర్ల దూరం ఉంది. పెట్రోలింగ్ పాయింట్ 15 వద్ద ఆ దూరం 8 నుంచి 10 కిలోమీటర్ల దూరం ఉందని తెలిసింది. గోగ్రా హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో మాత్రం చైనీస్ బలగాలు వెనక్కి తగ్గలేదని, తాము వెనక్కి మళ్లితే భారత్ దీన్ని ఆక్రమిస్తోందనే వంకతో అక్కడే ఉన్నాయని చెప్పింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Indo China Tension

    తదుపరి వార్తలు